ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్యాంగ్‌స్టర్ దూబే అనుచరుడి ఆస్తులపై ఐటీ దర్యాప్తు

ABN, First Publish Date - 2020-07-28T14:04:32+05:30

కాన్పూర్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే పారిపోయేందుకు మూడు లగ్జరీ కార్లను సమకూర్చిన అతని సన్నిహిత అనుచరుడు జైకాంత్ బాజ్‌పాయ్ ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ(ఐటీ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విభాగాలు ఆరా ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో (ఉత్తరప్రదేశ్): కాన్పూర్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే పారిపోయేందుకు మూడు లగ్జరీ కార్లను సమకూర్చిన అతని సన్నిహిత అనుచరుడు జైకాంత్ బాజ్‌పాయ్ ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ(ఐటీ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విభాగాలు ఆరా తీస్తున్నాయి. బిక్రూ గ్రామంలో 8మంది పోలీసులను హతమార్చిన తర్వాత వికాస్ దూబే పారిపోయేందుకు జైకాంత్ బాజ్ పాయ్ 3 లగ్జరీ కార్లను సమకూర్చాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో యూపీ సర్కారు వికాస్ దూబే సన్నిహితుడైన జైకాంత్ బాజ్ పాయ్ అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని ఐటీ,ఈడీలకు ఫిర్యాదు చేసింది. సర్కారు చేసిన ఫిర్యాదుతో ఐటీ, ఈడీ అధికారులు దాడులు చేసి జైకాంత్ బాజ్ పాయ్ ఆస్తులను సీజ్ చేశారు. పోలీసులను హతమార్చాక దూబే బాజ్ పాయ్ కు ఫోన్ చేయగా, అతనికి రూ.2లక్షల నగదు, 25 తూటాలతో రివాల్వరు, 3 లగ్జరీ కార్లను సమకూర్చాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. దూబే అనుచరుడైన బాజ్ పాయ్  ఉన్నట్టుండి కోట్లాదిరూపాయల ఆస్తులు కూడబెట్టారని పోలీసుల దర్యాప్తులో తేలింది. 

Updated Date - 2020-07-28T14:04:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising