ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామమందిర భూమి పూజ అనంత‌రం ల‌క్ష ఇళ్ల‌కు ల‌డ్డూలు!

ABN, First Publish Date - 2020-08-04T12:19:10+05:30

అయోధ్య రామాల‌యం భూమిపూజ వేడుకకు ముమ్మ‌ర ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ధర్మన‌గ‌రిలో లక్షలాది గృహాలకు మహాప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జ‌రు‌గుతున్నాయి. అయోధ్య‌లోని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అయోధ్య‌: అయోధ్య రామాల‌యం భూమిపూజ వేడుకకు ముమ్మ‌ర ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ధర్మన‌గ‌రిలో లక్షలాది గృహాలకు మహాప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జ‌రు‌గుతున్నాయి. అయోధ్య‌లోని వీధి కూడళ్ల‌ను, దేవాలయాలను అందంగా అలంకరించారు. రామాలయ నిర్మాణానికి సంబంధించిన భూమిపూజ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన‌నున్నారు. ఈ భూమి పూజ నిర్వ‌హ‌ణ భాధ్య‌త త‌మ‌కు ద‌క్కిన సువర్ణావకాశం అని ఎంపీ లల్లూ సింగ్ అన్నారు. స్థానికులు క్రమశిక్షణతో ఈ ఉత్స‌వాన్ని చేసుకోవాల‌ని,  అన్ని ఇళ్ల‌ను దీపాల‌తో అలంక‌రించాల‌ని కోరారు. కాగా కరోనా సంక్షోభం కారణంగా ఈ కార్యక్రమాన్ని అనేక నిబంధ‌న‌ల మ‌ధ్య నిర్వ‌హిస్తున్నారు. దూరదర్శన్‌తో పాటు ఇతర ఛానెళ్ల ద్వారా ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయ‌నున్నారు. అయోధ్య లోక్‌సభ నియోజకవర్గంలోని ప్ర‌తి ఇంటికీ ప్ర‌సాదం పంపిణీ చేయ‌నున్నారు. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో ఒక ల‌క్ష లడ్డూల ప్యాకెట్లు పంపిణీ చేయనున్నారు. కాగా అయోధ్య మునిసిపల్ కార్పొరేషన్, జిల్లా పరిపాలనా యంత్రాంగం నగరాన్ని సుంద‌రంగా అలంక‌రించాయి.

Updated Date - 2020-08-04T12:19:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising