ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లగ్జరీ హోటల్‌లో 8మంది ఎమ్మెల్యేలు.. కమల్‌నాథ్ ప్రభుత్వం కుప్పకూలుతుందా?

ABN, First Publish Date - 2020-03-04T15:38:05+05:30

మధ్య ప్రదేశ్‌లో కమల్‌నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త సంక్షోభంలో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. అధికార..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మధ్య ప్రదేశ్‌లో కమల్‌నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త సంక్షోభంలో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. అధికార పక్షానికి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు మంగళవారం అర్థరాత్రి గురుగ్రామ్‌లోని ఓ లగ్జరీ హోటల్‌లో దర్శనమిచ్చారు. దీంతో తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ కాంగ్రెస్ మంత్రులు ఆరోపిస్తున్నారు. బీజేపీ తమకు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను గురుగ్రామ్ హోటల్‌లో నిర్బంధించిందని కాంగ్రెస్ నేత, రాష్ట్ర ఆర్ధిక మంత్రి తరుణ్ భానోత్ ఆరోపించారు. ఇందులో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు, ఓ సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే, ఓ స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నట్టు ఆయన తెలిపారు. ఈ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు తనను అనుమతించడం లేదనీ.. హర్యానా పోలీసుల సాయంతో బీజేపీ వారిని చెరబట్టిందని తరుణ్ ఆరోపించారు.


మరోవైపు హోటల్‌ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ విడిపించుకున్నదనీ.. మిగతా వారితో కూడా పార్టీ చర్చలు జరుపుతోందనీ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ కుమారుడు జైవర్థన్ సింగ్ పేర్కొన్నారు. హోటల్ బయట బీజేపీ నేత నరోత్తమ్ మిశ్రా కూడా కనిపించారని జయవర్థన్ ఆరోపించారు. కాగా ఇవాళ ఉదయం దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘ఎమ్మెల్యేలు హోటల్లో ఉన్నట్టు సమాచారం అందగానే జీతూ పట్వారీ, జైవర్థన్ అక్కడికి వెళ్లారు. మాతో టచ్‌లో ఉన్నవారు వెనక్కి వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. బిసాహులాల్ సింగ్, రమాబాయితో మేము మాట్లాడాం. బీజేపీ వాళ్లు అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ రమాబాయి వెనక్కి వచ్చేశారు..’ అని పేర్కొన్నారు. కాగా ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో భాగంగానే మాజీ సీఎం శివరాజ్ చౌహాన్, మాజీ మంత్రులు నరోత్తమ్ మిశ్రా, భూపేంద్ర సింగ్, రాంగోపాల్ సింగ్ తదితరులు బలవంతంగా తమ ఎమ్మెల్యేలను హోటల్‌కు తరలించారని మంత్రి జీతూ పట్వారీ ఆరోపించారు. కాగా ఇప్పటికిప్పుడు తమ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని ముఖ్యమంత్రి కమల్‌నాథ్ నిన్న ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘‘తమకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామంటూ ఆఫర్లు వస్తున్నాయని మా ఎమ్మెల్యేలు చెప్పారు. ఉచితంగా డబ్బులు వస్తే తీసుకోమని నేను వాళ్లతో చెప్పాను..’’ అని కమల్‌నాథ్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-03-04T15:38:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising