ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మ‌ధ్య‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ లాల్‌జీ టండ‌న్ క‌న్నుమూత‌

ABN, First Publish Date - 2020-07-21T13:19:29+05:30

మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్‌జీ టండన్ ఈరోజు ఉదయం క‌న్నుమూశారు. లాల్‌జీ టండన్ (85) కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ, లక్నోలో చికిత్స పొందుతున్నారు. లాల్‌జీ టండన్ మరణాన్ని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్‌: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్‌జీ టండన్ ఈరోజు ఉదయం క‌న్నుమూశారు. లాల్‌జీ టండన్ (85) కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ, లక్నోలో చికిత్స పొందుతున్నారు. లాల్‌జీ టండన్ మరణాన్ని ఆయన కుమారుడు, యూపీ ప్రభుత్వ మంత్రి అశుతోష్ టండ‌న్ తెలిపారు....బాబూజీ ఇక లేరని ఆయన ట్వీట్ చేశారు. అంత‌కుముందు లాల్‌జీ టండన్ ఆరోగ్య ప‌రిస్థితి క్షీణించిన నేప‌ధ్యంలో వెంటిలేటర్‌పై ఉంచారు. ఈ విష‌యాన్ని‌ లక్నోలోని మెదాంత హాస్పిటల్ డైరెక్టర్ రాకేశ్ కపూర్ తెలిపారు. జూన్ 11 న మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్‌జీ టండన్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం, మూత్రవిసర్జనలో ఇబ్బందుల  కారణంగా లక్నోలోని మెదాంత ఆసుపత్రిలో చేరారు. లాల్‌జీ టండన్ ఆరోగ్యం రోజురోజుకు దిగజారింది. ఈ నేప‌ధ్యంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌కు మధ్యప్రదేశ్ అదనపు బాధ్యతల‌ను ప్ర‌భుత్వం అప్ప‌గించింది. 

Updated Date - 2020-07-21T13:19:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising