ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిత్యావసరాలను భుజాలపై మోస్తూ గిరిజనులకు చేరవేసిన కలెక్టర్, ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2020-03-31T00:58:31+05:30

దేశవ్యాప్త లాక్‌డౌన్ ఉండటంతో పెద్ద పెద్ద పట్టణాలు, నగరాల్లో నివసిస్తున్న వారే అష్టకష్టాలు పడుతున్నారు. ఇక చిన్న చిన్న గ్రామాలు, పల్లెలు చెప్పాల్సిన పనే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేరళ : దేశవ్యాప్త లాక్‌డౌన్ ఉండటంతో పెద్ద పెద్ద పట్టణాలు, నగరాల్లో నివసిస్తున్న వారే అష్టకష్టాలు పడుతున్నారు. ఇక చిన్న చిన్న గ్రామాలు, పల్లెలు చెప్పాల్సిన పనే లేదు. ఇవే ఇలా ఉంటే, మారుమూలలో ఉండే గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజల మాటేమిటి? కొండలు, గుట్టలు ఎక్కి మరీ, వారి అవసరాలను గుర్తించి, వాటిని తీర్చే వారుంటారా? అంటే.. అవును ఉంటారు. ఇప్పటికీ చిత్తశుద్ధితో పనిచేస్తున్న కలెక్టర్లు, ఎమ్మెల్యేలు ఉండటంతో లాక్‌డౌన్ సమయంలో కూడా గిరిజన ప్రాంతాల వారికి అవసరమైన నిత్యావసరాలు, సరుకులు అందుతున్నాయి.


కేరళలోని పథనమ్ తిట్ట’ అనే జిల్లాకు చెందిన పీబీ నూహ్ అనే కలెక్టర్,  స్థానిక ఎమ్మెల్యే జెనిష్ కుమార్ ఇలా చేసే గిరిజనుల ఆకలి దప్పులను తీరుస్తున్నారు. దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా వారిద్దరూ తమ భుజాలపై నిత్యావసరాలను మోస్తూ, గుట్టలు, వాగులు, వంకలు దాటి మరీ వారి అవసరాలను తీర్చారు. పథనమ్ తిట్ట అనే పట్టణం నుంచి నిత్యావసర వస్తువులను భుజాలపై మోస్తూ దాదాపు గంటన్నర నడిచి గిరిజనులున్న దట్టమైన అడవి ప్రాంతానికి చేరుకున్నారు. వారికి అవసరమైన నిత్యావసరాలను అందించి వారిద్దరూ తిరుగు ప్రయాణమయ్యారు. 


Updated Date - 2020-03-31T00:58:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising