ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అది మా ఇండియా డీఎన్‌ఏలోనే లేదు: జుకర్‌బర్గ్‌తో ముకేష్ అంబానీ

ABN, First Publish Date - 2020-12-15T22:29:05+05:30

సంక్షోభానికి, ఉపద్రవానికి కుంగిపోవడం భారత్ డీఎన్‌ఏలోనే లేదని.. సంక్షోభాన్ని కొత్త అధ్యాయానికి అవకాశంగా మలుచుకునే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: సంక్షోభానికి, ఉపద్రవానికి కుంగిపోవడం భారత్ డీఎన్‌ఏలోనే లేదని.. సంక్షోభాన్ని కొత్త అధ్యాయానికి అవకాశంగా మలుచుకునే నైజం ఇండియాకు ఉందని ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ చెప్పారు. డిజిటల్ ఇండియా భాగస్వామ్యానికి సంబంధించి.. ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్‌తో జరిగిన సంభాషణలో ముకేష్ అంబానీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే రెండు దశాబ్దాల్లో భారత్ ప్రపంచంలో ఆర్థిక వృద్ధి సాధించిన టాప్ 3 దేశాల్లో ఒకటిగా నిలుస్తుందని ఆయన చెప్పారు. అయితే.. కరోనా లాంటి ఉపద్రవం ఐదేళ్ల క్రితం భారత్ ఎదుర్కోవాల్సి వచ్చి ఉంటే.. పరిస్థితి ఊహించని విధంగా ఉండి ఉండేదని అంబానీ వ్యాఖ్యానించారు. ‘డిజిటల్ ఇండియా’ను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినందుకు మోదీ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ మాట్లాడుతూ.. గత నెలలో భారత్‌లో వాట్సాప్ పేను ఆవిష్కరించామని.. యూపీఐ విధానంతో పాటు 140 బ్యాంకుల వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. ఇలాంటివి చేయగలిగిన తొలి దేశం ఇండియానేనని మార్క్ జుకర్‌బర్గ్ చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-12-15T22:29:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising