ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వాతావరణ మార్పులపై పోరుకు ఓజోన్ పొర సాయపడుతోంది’

ABN, First Publish Date - 2020-03-28T21:57:00+05:30

అంటార్కిటికా ఓజోన్ పొరకు ఏర్పడిన రంధ్రాన్ని పూడ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయి. దీంతో వాతావరణ మార్పులపై పోరాటానికి ఓజోన్ పొర సాయపడుతోంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : అంటార్కిటికా ఓజోన్ పొరకు ఏర్పడిన రంధ్రాన్ని పూడ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయి. దీంతో వాతావరణ మార్పులపై పోరాటానికి ఓజోన్ పొర సాయపడుతోంది. మాంట్రియల్ ఒప్పందం ప్రకారం అంతర్జాతీయ సహకారం లభిస్తుండటంతో ఇది సాధ్యమైందని ‘నేచర్’ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయన నివేదిక వెల్లడించింది.  


సూర్యుని నుంచి వెలువడే హానికర కాంతి కిరణాల నుంచి ఓజోన్ పొర భూమిపై జీవులను కాపాడుతుంది. ఈ పొర క్షీణించేందుకు పారిశ్రామికీకరణ వంటి మానవుని కార్యకలాపాలే కారణమవుతున్నాయి. కొన్ని దశాబ్దాల నుంచి క్షీణిస్తున్న ఈ పొరను కాపాడటంలో మాంట్రియల్ ఒప్పందం విశేష పాత్ర పోషిస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం ప్రపంచ దేశాలు తమ వంతు తోడ్పాటు అందిస్తున్నాయి. దీంతో స్ట్రాటోస్ఫియరిక్ ఓజోన్ తిరిగి వాతావరణాన్ని కాపాడగలిగే స్థితికి చేరుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 


వాతావరణంలోని పై భాగంలో సుడిగాలి మాదిరిగా బలంగా వీచే గాలులను సదరన్ జెట్ స్ట్రీమ్ అంటారు. దక్షిణ అర్ధ గోళంలో, ముఖ్యంగా వేసవి కాలంలో, వాతావరణ పరిస్థితులు, మహా సముద్రాల ప్రవాహాలపై ఈ గాలుల ప్రభావం ఉంటుంది. ఈ గాలులు ప్రస్తుతం, అంతకుముందు మాదిరిగానే, సాధారణ స్థితికి చేరుకున్నట్లు వెల్లడైంది. దీనినిబట్టి ఓజోన్ పొర మరమ్మతుకు చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతున్నట్లు స్పష్టమవుతోంది. 


రిఫ్రిజిరేటర్లలో వాడే క్లోరోఫ్లోరోకార్బన్లు వంటి పదార్థాలు ఓజోన్ పొర క్షీణించడానికి కారణమవుతాయి. ఇటువంటి పదార్థాల వినియోగాన్ని క్రమంగా నివారించడమే లక్ష్యంగా మాంట్రియల్ ఒప్పందం కుదిరింది. 


ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన అధ్యయనంలో వెల్లడైన అంశాల ప్రకారం, ఓజోన్ క్షీణతకు కారణమవుతున్నవాటిని నిర్మూలించేందుకు ప్రపంచంలోని వివిధ దేశాల ప్రభుత్వాలు సరైన రీతిలో సమన్వయంతో చర్యలు తీసుకుంటే, వాతావరణ వ్యవస్థల్లో కొన్నిటిని చక్కదిద్దేందుకు అవకాశం ఉంటుంది. మానవ కార్యకలాపాల వల్ల ప్రమాదంలో పడిన వాతావరణ వ్యవస్థలను తిరిగి సరిదిద్ద వచ్చునని స్పష్టమవుతోంది.


Updated Date - 2020-03-28T21:57:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising