ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామునికి వ్యతిరేకంగానే పవార్ వ్యాఖ్యలు : ఉమ

ABN, First Publish Date - 2020-07-20T20:09:42+05:30

ఆలయం కట్టడం ద్వారా కరోనా వైరస్ నిర్మూలనవుతుందని కొందరు భావిస్తున్నారంటూ ఎన్‌సీపీ చీఫ్ శరద్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సెహోర్: ఆలయం కట్టడం ద్వారా కరోనా వైరస్ నిర్మూలనవుతుందని కొందరు భావిస్తున్నారంటూ ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమాభారతి స్పందించారు. పవార్ ప్రకటన రాముడికి వ్యతిరేకమని, ప్రధాని మోదీకి కాదని అన్నారు. సోమవారంనాడిక్కడ మీడియాతో ఉమాభారతి మాట్లాడుతూ, ప్రధాని మోదీ ఒక్క రోజు కూడా ఎన్నడూ సెలవు తీసుకోలేదని, రోజులో నాలుగు గంటలు మాత్రమే నిద్రిస్తారని చెప్పారు. పవార్ ప్రకటన రాముడికి వ్యతిరేకంగా చేసినదే కానీ మోదీకి వ్యతిరేకంగా కాదని అన్నారు.


అయోధ్యలో రామాలయ శంకుస్థాపన కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు వచ్చే ఆగస్టులో రెండు తేదీలను ప్రతిపాదించడంపై శరద్ పవార్ ఇటీవల మాట్లాడుతూ, రామాలయం కడితే కరోనా వైరస్ నిర్మూలనవుతుందని కొందరు అనుకుంటున్నట్టు చెప్పారు. లాక్‌డౌన్‌తో ఆర్థిక సంక్షోభం నెలకొందని, ఆ అంశంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. కాగా, ఆగస్టు 3 లేదా 5వ తేదీల్లో జరిగే శంకుస్థాపనకు హాజరుకావాలని మోదీని ట్రస్టు ఆహ్వానించింది.

Updated Date - 2020-07-20T20:09:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising