ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈయూ, బ్రిటన్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం! నెక్స్ట్ శుభం కార్డే!

ABN, First Publish Date - 2020-12-25T02:52:33+05:30

బ్రెక్జిట్ కథ చివరి అంకానికి చేరుకున్నట్టే కనిపిస్తోంది. ఐరోపా సమాఖ్య(ఈయూ) నుంచి వైదొలగిన అనంతరం..ఈయూ దేశాలతో వాణిజ్యం సంబంధాలపై బ్రిటన్ ఇంతకాలంగా చేపట్టిన చర్చలు ఓకొలిక్కి వచ్చాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రస్సెల్స్: బ్రెక్జిట్ కథ ముగింపునకు చేరుకున్నట్టే కనిపిస్తోంది. ఐరోపా సమాఖ్య(ఈయూ) నుంచి వైదొలగిన అనంతరం..ఈయూ దేశాలతో వాణిజ్య సంబంధాలపై బ్రిటన్ ఇంతకాలంగా చేపట్టిన చర్చలు ఓకొలిక్కి వచ్చాయి. ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కీలక ప్రకటన చేశారు. డీల్ ఈజ్ డన్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఎట్టకేలకు తమ మధ్య ఏకాభిప్రాయం కుదిరిందంటూ యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డర్ లయన్ కూడా కామెంట్ చేశారు. ఇది ఎన్నో మలుపులు ఉన్న సుదీర్ఘ ప్రయాణమని, ఎట్టకేలకు ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన ఒప్పందం కుదరిందని తెలిపారు. దీంతో..ఐరోపా సమాఖ్య ఏకీకృత మార్కెట్ నుంచి బ్రిటన్ వైదొలగడం పూర్తైంది. 


రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఐరోపా సమాఖ్య ఉనికిలోకి వచ్చిన విషయం తెలిసిందే. యుద్ధాలతో రక్తసిక్తమైన యూరప్ దేశాలను రాజకీయంగా, ఆర్థికంగా ఏకం చేయాలనేదే ఈ సమాఖ్య ఏర్పాటు వెనుకున్న అసలు లక్ష్యం. అయితే..ఆర్థికపరమైన అంశాల కారణంగా ఈ ఏర్పాటుపై బ్రిటన్ ప్రజల్లో రేగిన అసంతృప్తి 2016 నాటి రెఫరెండంలో పెల్లుబికింది. ఐరోపా సమాఖ్య నుంచి వైదొలగాల్సిందేనని బ్రిటన్ ప్రజలు ఈ రెఫరెండం ద్వారా స్పష్టం చేశారు. అయితే..ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగాక(బ్రెక్జిట్) ఇరు వర్గాలు కొత్త వాణిజ్యం ఒప్పందానికై చర్చలు ప్రారంభించాయి. ఇవి పూర్తయ్యే వరకూ బ్రిటన్ ఈయూ నిబంధనలకే కట్టుబడి ఉండాలని రెండు వర్గాలు తీర్మానించుకున్నాయి. ఈ తీర్మానం గడువు డిసెంబర్ 31న ముగియనుండగా..డీల్ కుదిరిందంటూ బ్రిటన్, ఈయూలు తాజాగా ప్రకటించాయి. అయితే..ఈయూ దేశాలతో పాటు బ్రిటన్ పార్లమెంట్ కూడా ఈ ఒప్పందానికి ఆమోదముద్ర వేస్తే..జనవరి 1 నుంచి ఈ ఆర్థిక సమాఖ్యనుంచి బ్రిటన్ వైదొలగినట్టవుతుంది.

Updated Date - 2020-12-25T02:52:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising