ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చలి మంటల వద్ద రైతులతో సమాజ్‌వాదీ పార్టీ సమావేశాలు

ABN, First Publish Date - 2020-12-25T19:30:38+05:30

నూతన వ్యవసాయ చట్టాలకు అనుకూల, ప్రతికూల సమావేశాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : నూతన వ్యవసాయ చట్టాలకు అనుకూల, ప్రతికూల సమావేశాలు ఊపందుకున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతలు దేశవ్యాప్తంగా రైతులకు ఈ చట్టాల వల్ల కలిగే లాభాలను చెప్తూ ఉంటే, ప్రతిపక్షాలు ఈ చట్టాల వల్ల కలిగే దుష్ఫలితాలను వివరిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ కూడా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ నేతలు గ్రామాల్లో చలి మంటల వద్ద చలి కాచుకునే రైతులతో మాట్లాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబరు 25న ఈ సమావేశాలు జరిగాయి. మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వివిధ రాష్ట్రాల రైతులతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడారు. 


మోదీ శుక్రవారం ‘కిసాన్ సంవాద్’లో రైతుల ఆందోళనను తొలగించేందుకు ప్రయత్నించారు. నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు కలిగే మేలును వివరించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రూ.18 వేల కోట్లు జమ చేశారు.  


నూతన వ్యవసాయ చట్టాలపై నిరసన తెలుపుతున్న రైతులకు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ మద్దతు పలికారు. రైతుల లక్ష్యానికి తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఆ పార్టీకి చెందిన ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులంతా గ్రామల్లో చలి మంటల వద్ద రైతులతో సమావేశమవ్వాలని అఖిలేశ్ ఆదేశించారు. చలిమంటల వద్ద సమావేశాలు నిర్వహించవలసిన 132 మంది నేతల జాబితాను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. 


అఖిలేశ్ యాదవ్ గురువారం మాట్లాడుతూ, రైతులకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేసినంత అన్యాయం గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. ఆ పార్టీ రైతులకు చేసిన వాగ్దానాల్లో కనీసం ఒకదానినైనా అమలు చేయలేదన్నారు. పరిస్థితిని మరింత దయనీయంగా మార్చడానికి మూడు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిందన్నారు. మోదీ కిసాన్ సంవాద్ నిర్వహించడం, కిసాన్ సమ్మాన్ నిధిని పంపిణీ చేయడం రైతులను అవమానించడమేనన్నారు. 



Updated Date - 2020-12-25T19:30:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising