ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులు పనిచేయకపోతే దబిడిదిబిడే: కర్ణాటక సీఎం వార్నింగ్

ABN, First Publish Date - 2020-07-15T01:44:06+05:30

కరోనా కట్టడిపై శ్రద్ధ పెట్టని మున్సిపల్ సిబ్బంది, ఆరోగ్య శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కరోనా కట్టడిపై శ్రద్ధ పెట్టని మున్సిపల్ సిబ్బంది, ఆరోగ్య శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప హెచ్చరించారు. కరోనా నియంత్రణ కోసం తీసుకోవాల్సి చర్యలపై సోమవారం మధ్యాహ్నం సీఎం టాస్క్ ఫోర్స్ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. బాధ్యతలు నిర్వహించడంలో విఫలమైన అధికారులపై కఠిన చర్యలు తప్పవని గట్టి వార్నింగ్ ఇచ్చారు. అంబులెన్సులు, ఆస్పత్రిలో బెడ్లు అందుబాటులేవని ప్రభుత్వానికి అందుతున్న ఫిర్యాదుల విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. బెడ్లు ఖాళీ లేవంటూ రోగులను తిప్పి పంపిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. కరోనా రిపోర్టుల విషయంలో జరుగుతున్న జాప్యంపై కూడా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 77 ల్యాబుల్లో రోజుకు 77 వేల పరీక్షలు జరిపే అవకాశం ఉన్నప్పటికీ  రిపోర్టుల విడుదలలో జాప్యం ఎందుకు జరుగుతోందని ఆయన అధికారులన నిలదీశారు. అక్కడి పరిస్థితులన తక్షణమే చక్కదిద్ది, పరీక్షల రిపోర్టులు తొందరగా విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. 

Updated Date - 2020-07-15T01:44:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising