ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తేజస్‌కు కరోనా బ్రేకులు... కాశీ- మహాకాళ్ ఎక్స్‌ప్రెస్‌ రద్దు

ABN, First Publish Date - 2020-03-19T11:35:16+05:30

కరోనా వైరస్ భారతీయ రైల్వేలను కూడా దెబ్బతీస్తోంది. కరోనా భయాల నేపథ్యంలో ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని దేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ రైలు - తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైరస్ భారతీయ రైల్వేలను కూడా దెబ్బతీస్తోంది. కరోనా భయాల నేపథ్యంలో  ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని దేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ రైలు - తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. పర్యాటక మంత్రిత్వశాఖ సూచనల మేరకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌సిటిసి) ఈ నిర్ణయం తీసుకుంది. లక్నో- ఢిల్లీ, అహ్మదాబాద్- ముంబై మధ్య నడుస్తున్న తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను మార్చి 31 వరకు రద్దు చేయనున్నట్లు ఐఆర్‌సిటిసి తెలిపింది. ఇవే కాకుండా వారణాసి- ఇండోర్ మధ్య ఇటీవలే ప్రారంభమైన కొత్త రైలు - కాశీ-మహాకాళ్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా ఏప్రిల్ 1 వరకు రద్దు చేశారు. అయితే ఇప్పటికే ఈ రైళ్లకు సంబంధించి టిక్కెట్లు తీసుకున్న ప్రయాణీకులకు వారి డబ్బు తిరిగి చెల్లిస్తామని రైల్వేశాఖ ప్రకటించింది. కరోనా వైరస్ భయాల కారణంగా రైల్వేలో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ మొత్తం 85 రైళ్లను రద్దు చేసింది. ఈ రైళ్లనన్నింటినీ ఏప్రిల్ 1 వరకు నిలిపివేయనున్నారు.

Updated Date - 2020-03-19T11:35:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising