ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉధృతంగా హొగెనేకల్‌ జలపాతం

ABN, First Publish Date - 2020-07-22T14:59:59+05:30

ఉధృతంగా హొగెనేకల్‌ జలపాతం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: కర్ణాటక డ్యాంల నుంచి కావేరి నదిలో నీటిని విడుదల చేయడంతో హొగెనేకల్‌ వద్ద సెకనుకు 7 వేల ఘనపుటడుగుల నీరు రాక పెరిగింది. కర్ణాటక రాష్ట్రం కుడగుపాండియా, చామ రాజనగర్‌, కేరళ రాష్ట్రంలోని వయనాడు తదితర కావేరి పరివాహక ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవనాల ప్రభావం తో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కర్ణాటక రాష్ట్రంలోని కబిని డ్యాం నుంచి 1,500, కృష్ణరాజసాగర్‌ డ్యాం నుంచి 4,772 ఘనపుటడుగుల నీటిని కావేరి నది లోకి విడుదల చేస్తున్నారు. అలాగే, రాష్ట్రంలోని కావేరి పరి వాహక ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తుండడంతో హొగెనేకల్‌కు నీటి రాక పెరిగింది. సోమవారం సాయం త్రం 5,500 ఘనపుటడుగులుగా వస్తున్న నీరు మంగళ వారం ఉదయం 8 గంటలకు 6,500 ఘనపుటడుగులు, 11 గంటలకు 7 వేల ఘనపుటడుగులకు పెరిగింది. దీంతో హొగెనేకల్‌ ప్రధాన జలపాతం, ఐందరువి సహా ఐదు జలపాతాల్లో నీటి ఉధృతి పెరిగింది. హొగెనేకల్‌ కావేరి నదిలో వస్తున్న నీటి వివరాలను కేంద్ర జలవనరుల శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు ప్రజాపనుల శాఖ అధికారులు తెలిపారు.

Updated Date - 2020-07-22T14:59:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising