ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా పీడిత రాష్ట్రాల్లో ట్రంప్‌కు భారీ మెజారిటీ!

ABN, First Publish Date - 2020-11-07T06:40:12+05:30

అమెరికాలో కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించలేకపోయారని.. బాధితులకు సరైన చికిత్స అందించలేకపోయారని.. ఈ కారణంగానే ట్రంప్‌ ఎన్నికల్లో ఓటమి దిశగా పయనిస్తున్నారని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌, నవంబరు 6: అమెరికాలో కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించలేకపోయారని.. బాధితులకు సరైన చికిత్స అందించలేకపోయారని.. ఈ కారణంగానే ట్రంప్‌ ఎన్నికల్లో ఓటమి దిశగా పయనిస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే ఆ దేశంలో కరోనా విజృంభించిన రాష్ట్రాల్లోనే ఆయనకు భారీ మెజారిటీ రావడం వారికి విస్మయం కలిగిస్తోంది. ఆయా రాష్ట్రాల్లోని 376 కౌంటీలు తీవ్రంగా వైర్‌సకు ప్రభావితమయ్యాయి. వాటిలో 93ు కౌంటీలు ఎన్నికల్లో ట్రంప్‌కు భారీగా ఓట్లేసినట్లు తేటతెల్లమైంది. నార్త్‌ డకోటా, సౌత్‌ డకోటా, మొంతానా, నెబ్రాస్కా, విస్కాన్సిన్‌, అయోవా రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ట్రంప్‌కు అత్యధిక ఓట్లు పోలయ్యాయి. నిజానికి దేశంలో వైరస్‌ నియంత్రణపై ఓటర్లు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేశారు. షికాగో యూనివర్సిటీలోని ఎన్‌వోఆర్‌సీ 1,10,000 మందిని సర్వే చేసింది. ట్రంప్‌ మద్దతుదారుల్లో 36 శాతం మంది.. కరోనా సంపూర్ణంగా నియంత్రణలో ఉందని అభిప్రాయపడ్డారు. ఫర్వాలేదు.. కొంతవరకు అదుపులోనే ఉందని 47ు పేర్కొన్నారు. బైడెన్‌ మద్దతుదారుల్లో 82 శాతం మంది వైరస్‌ అదుపులో లేదని తెలిపారు. 

Updated Date - 2020-11-07T06:40:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising