చైనా వైర్‌సను తుదముట్టిస్తాం: ట్రంప్
ABN, First Publish Date - 2020-10-12T07:42:32+05:30
అమెరికా వైద్య, శాస్త్ర పరిజ్ఞానశక్తితో చైనా వైర్‌సను పూర్తిగా తుదముట్టిస్తామని అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని చెప్పారు...
వాషింగ్టన్, అక్టోబరు 11 : అమెరికా వైద్య, శాస్త్ర పరిజ్ఞానశక్తితో చైనా వైర్‌సను పూర్తిగా తుదముట్టిస్తామని అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని చెప్పారు. కరోనా వైరస్ సోకి ఆస్పత్రిలో ఉన్న సమయంలో తన కోసం ప్రార్థనలు చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వాల్టర్ రీడ్ సైనిక ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన అనంతరం శనివారం ఆయన తొలిసారి ప్రజల ముందుకు వచ్చారు.
శ్వేతసౌధం సౌత్ లాన్లో రిపబ్లికన్ మద్దతుదారులను ఉద్దేశించి బ్లూ రూం బాల్కనీ నుంచే ప్రసంగించారు. బైడెన్ అధికారంలోకి వస్తే డెమొక్రాటిక్ పార్టీ అమెరికాను సోషలిస్టు దేశంగా మారుస్తుందని ఆరోపించారు. నల్లజాతి, లాటిన్ అమెరికన్లకు ఆ పార్టీ వ్యతిరేకమన్నారు. డెమొక్రాట్లు అధికారంలో ఉన్న నాలుగు నగరాల్లో గత ఏడాది 1000 మందికిపైగా ఆఫ్రో అమెరికన్లు హత్యకు గురయ్యారని చెప్పారు. కాగా, ట్రంప్ హయాంలో నిరుద్యోగం పెచ్చరిల్లిందని డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ ఆరోపించారు. కాగా, ట్రంప్‌కు ఇక వైరస్ సోకే ప్రమాదం లేదని శ్వేతసౌధం వైద్యుడు సియాన్ కాన్లే చెప్పారు.
Updated Date - 2020-10-12T07:42:32+05:30 IST