ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్ నుంచి యూకేకి 30 లక్షల యూనిట్ల పారాసిటమాల్

ABN, First Publish Date - 2020-04-16T00:09:20+05:30

భారత్ నుంచి 30 లక్షల పారాసిటమాల్ యూనిట్లు దిగుమతి చేసుకోనున్నట్టు యూకే విదేశాంగ శాఖ వెల్లడించింది. భారత ప్రభుత్వంతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: భారత్ నుంచి 30 లక్షల పారాసిటమాల్ యూనిట్లు దిగుమతి చేసుకోనున్నట్టు యూకే విదేశాంగ శాఖ వెల్లడించింది. భారత ప్రభుత్వంతో ఈ మేరకు చర్చలు జరిపినట్టు ట్విటర్ వేదికగా ప్రకటించింది. ‘‘భారత్‌తో చర్చల దరిమిలా అక్కడి నుండి యునైటెడ్ కింగ్‌డమ్‌ 3 మిలియన్ల పారాసిటమాల్ యూనిట్లు అందుకోనుంది. రెండు వారాల్లో ఇవి వస్తాయి. యూకేలోని అన్ని ప్రముఖ సూపర్ మార్కెట్లలో వీటిని అందుబాటులో ఉంచుతాం..’’ అని యూకే విదేశాంగ, కామన్వెల్త్ కార్యాలయం ఓ ట్వీట్‌లో పేర్కొంది. యూకేలో ఇప్పటి వరకు 90 వేలకు పైగా కొవిడ్-19 కేసులు నమోదు కాగా.. 12 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్‌తో పోరాడుతున్న పలు దేశాల అభ్యర్థన మేరకు పారాసిటమాల్, హైడ్రాక్సీక్లోరోక్వీన్  మాత్రల ఎగుమతిపై నిషేధాన్ని తాత్కాలికంగా సడలిస్తూ ఇటీవల భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 

Updated Date - 2020-04-16T00:09:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising