ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సానుకూల మార్పునకు జ్ఞానం మార్గదర్శనం

ABN, First Publish Date - 2020-05-10T07:41:02+05:30

‘‘ఆధ్యాత్మిక జ్ఞానం వైయక్తికం అయితే అది వ్యక్తిగతంగా ముక్తికి ఉపకరిస్తుంది. అదే జ్ఞానాన్ని అందరిపై ప్రసరింపజేస్తే సమాజంలో సానుకూల దృక్పథం, ఆత్మస్థైర్యం, సామరస్య జీవనం పెరిగేందుకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఆధ్యాత్మికవేత్తలు, ప్రవచనకర్తలతో ఉప రాష్ట్రపతి వెంకయ్య


న్యూఢిల్లీ, మే 9(ఆంధ్రజ్యోతి): ‘‘ఆధ్యాత్మిక జ్ఞానం వైయక్తికం అయితే అది వ్యక్తిగతంగా ముక్తికి ఉపకరిస్తుంది. అదే జ్ఞానాన్ని అందరిపై ప్రసరింపజేస్తే సమాజంలో సానుకూల  దృక్పథం, ఆత్మస్థైర్యం, సామరస్య జీవనం పెరిగేందుకు అవసరమైన చైతన్యాన్ని కలిగిస్తుంది. సమాజానికి మరింత మార్గదర్శనం చేయాలి’’ అని ఆధ్యాత్మికవేత్తలు, ప్రవచనకర్తలతో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.


ఇప్పటికే పలువురు ఆధ్మాతికవేత్తలతో మాట్లాడిన ఆయన తాజాగా కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామీజీ, మాతా అమృతానందమయి, గణపతి సచ్చిదానంద స్వామి, స్వరూపానంద స్వామి, పరిపూర్ణానంద స్వామి, కమలానంద భారతి, ఢిల్లీ జామా మసీదు మౌలానా బుఖారీ, బ్రహ్మకుమారి దీదీ రతన్‌ మోహిని, సీబీఎ్‌సఐ అధ్యక్షుడు అబు ఓస్వాల్డ్‌ కార్డినల్‌ గ్రేసియస్‌, అజ్మీర్‌ దర్గా చీఫ్‌ షరీఫ్‌ అమీన్‌ పఠాన్‌, ఢిల్లీ బంగ్లా సాహెబ్‌ గురుద్వారాకు చెందిన మంజిత్‌ సింగ్‌, పార్సీ గురు దస్తూర్‌ కే కైకోబాద్‌తో పాటు సేంద్రియ వ్యవసాయ మార్గదర్శకులు సుభాష్‌ పాలేకర్‌, ఖాదర్‌ వలీతో ఫోన్‌లో మాట్లాడారు. 


మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ భూలక్ష్మికి  ఉప రాష్ట్రపతి ఫోన్‌

నిర్మల్‌ పురపాలక సంఘం మాజీ చైర్‌పర్సన్‌ అయ్యన్నగారి భూలక్ష్మికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శనివారం ఫోన్‌ చేసి, ఆమె యోగ క్షేమాలు తెలుసుకున్నారు. నిర్మల్‌ జిల్లాలో కరోనా తీరును ఆరా తీశారు. వైరస్‌ నియంత్రణకు అధికారులు చేపడుతున్న చర్యలు తెలుసుకున్నారు. కట్టుబాట్లను పాటించడంతో పాటు ప్రజలు ఆచరించేలా చూడాలని ఆయన భూలక్ష్మిని కోరారు. 



Updated Date - 2020-05-10T07:41:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising