ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దొంగతనానికెళ్లి... చేపల పులుసు తిని... తన్నులు తిని

ABN, First Publish Date - 2020-06-16T20:30:30+05:30

దొంగతనానికెళ్ళాడు., వంటగదిలో చేపలు పులుసు చూసి టెంప్ట్ అయ్యాడు., కడుపు నిండా తినేసి నిద్రపోయాడు. చివరికు... జనాలకు చిక్కి తిన్నదంతా అరిగేలా తన్నులు తిన్నాడు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కన్యాకుమారి : దొంగతనానికెళ్ళాడు., వంటగదిలో చేపలు పులుసు చూసి టెంప్ట్ అయ్యాడు., కడుపు నిండా తినేసి నిద్రపోయాడు. చివరికు... జనాలకు చిక్కి తిన్నదంతా అరిగేలా తన్నులు తిన్నాడు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.


సతీష్ అనే యువకుడు దొంగతనం చేసేందుకు ఓ ఇంట్లోకి దూరాడు. అయితే... నగలు, నగదు వంటి విలువైన వస్తువులేవీ లభించకపోవడంతో నిరాశ చెందాడు. ఇక తిరిగి వెళ్లిపోదామనుకునేసరికి... వంటగదిలో చేపల కూర ఘుమఘుమలు రమ్మని పిలిచాయి. అసలే ఆకలితో ఉన్నాడో ఏమో... ఓ పట్టుపట్టేద్దాం అని కూర్చున్నాడు. కూర రుచిగా ఉండటంతో కడుపు నిండా లాగించేశాడు.


ఆ తర్వాత మేడపైకి వెళ్లాడు. భుక్తాయాసంతో అతడి కళ్లు మూతలు పడ్డాయి. అంతే... మేడ పైనే మైకం వచ్చినట్లు పడుకునిపోయాడు. బారెడు పొద్దెక్కినా మెలకువ రాలేదు. ఇంతలో ఇంటి యజమాని వచ్చేశాడు. ఇంట్లో చిందరవందరగా ఉన్న వస్తువులు చూసి దొంగతనం జరిగినట్లు తెలుసుకున్నాడు. ఈ విషయాన్ని ఇరుగుపొరుగువారికి చెప్పాడు. ఇంట్లో సీసీటీవీ కెమేరాలో రికార్డైన వీడియోను చూసి మేడపైకి వెళ్లారు. నిద్రపోతున్న దొంగను చూసి షాకయ్యారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు.

Updated Date - 2020-06-16T20:30:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising