ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌ దుర్వినియోగమైంది!

ABN, First Publish Date - 2020-10-13T08:12:29+05:30

కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మాట మార్చింది. తొలుత వైరస్‌ నియంత్రణకు లాక్‌డౌన్‌ను సమర్థించిన డబ్ల్యూహెచ్‌వో.. తాజాగా వైరస్‌ నియంత్రణ పేరిట ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్‌ను దుర్వినియోగం చేస్తున్నాయని పేర్కొంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • వైరస్‌ కట్టడికి అదే మార్గం కాదు: డబ్ల్యూహెచ్‌వో

వాషింగ్టన్‌, అక్టోబరు 12: కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మాట మార్చింది. తొలుత వైరస్‌ నియంత్రణకు లాక్‌డౌన్‌ను సమర్థించిన డబ్ల్యూహెచ్‌వో.. తాజాగా వైరస్‌ నియంత్రణ పేరిట ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్‌ను దుర్వినియోగం చేస్తున్నాయని పేర్కొంది. ‘వైర్‌సను నియంత్రించే ప్రాథమిక పద్ధతిగా లాక్‌డౌన్‌ను వినియోగించడం ఆపండి’ అని డబ్ల్యూహెచ్‌వోకు చెందిన డాక్టర్‌ డేవిడ్‌ నబరో ప్రపంచ దేశాల నేతలను కోరారు. లాక్‌డౌన్‌ల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయన్నారు. అన్ని రంగాలూ కుదేలయ్యాయని, వచ్చే ఏడాదికి ప్రపంచ వ్యాప్తంగా పేదరికం, పిల్లల్లో పౌష్టికాహార లోపం రెట్టింపయ్యే అవకాశం ఉందని నబరో వ్యాఖ్యానించారు. వైరస్‌ నియంత్రణకు లాక్‌డౌన్‌ కంటే మెరుగైన వ్యవస్థలను అన్వేషించాలని, దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. 

Updated Date - 2020-10-13T08:12:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising