ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధాని మోదీ నిర్వహించే అఖిలపక్ష భేటీకి ఎవరెవరు హాజరవబోతున్నారంటే..

ABN, First Publish Date - 2020-06-19T18:59:20+05:30

సరిహద్దుల్లో చైనా చేస్తున్న దుశ్చర్యలపై శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం జరగబోతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనా చేస్తున్న దుశ్చర్యలపై శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం జరగబోతోంది. చైనా పట్ల భారత్ అవలంబిస్తున్న వైఖరి.. భవిష్యత్తులో చైనా పట్ల భారత్ విధానాలు ఎలా ఉండాలి..? విదేశాంగ విధానంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందా..? వంటి అంశాలపైనే ప్రధానంగా చర్చ జరగబోతోంది.. ఆయుధాలు లేకుండా సైనికులను రంగంలోకి దింపారంటూ మోదీపై రాహూల్ గాంధీ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఈ అఖిల పక్ష భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. 


ప్రధాని మోదీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ వర్చువల్ సమావేశానికి 20 పార్టీల నుంచి ప్రతినిధులు హాజరవనున్నారు. లోక్ సభలో కనీసం 5గురు ఎంపీల ప్రాతినిథ్యం ఉన్న ప్రతీ పార్టీని ఈ సమావేశానికి పిలిచారు. కేంద్రమంత్రి మండలిలో భాగస్వామ్యం కలిగిన పార్టీలను, ప్రత్యేకించి ఈశాన్య భారతంలోని ప్రధాన పార్టీల తరపున సభ్యులు ఈ భేటీలో పాల్గొంటారు. హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ అఖిల పక్ష భేటీలో పాల్గొంటారు. ఈ భేటీకి హాజరుకాబోయే పార్టీల అధినేతలకు.. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ ఆహ్వానించడం గమనార్హం. 

Updated Date - 2020-06-19T18:59:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising