ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్లపైకి వచ్చిన కరోనా భూతం, యముడు

ABN, First Publish Date - 2020-04-15T21:19:41+05:30

'ఇళ్లలోనే ఉండండి...మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను రక్షించుకోండి' అంటూ కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రచారంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీహార్: 'ఇళ్లలోనే ఉండండి...మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను రక్షించుకోండి' అంటూ కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రచారంలో భాగంగా బిహార్‌లోని ముంగెర్ జిల్లా యంత్రాంగం వినూత్న ప్రచారం చేపట్టింది. ఇందులో భాగంగా, నరక లోకాధిపతి యమధర్మరాజు వేషధారి రోడ్లపైకి వచ్చి ప్రజల్లో చైత్యనం కలిగించాడు. నల్లటి దుస్తులు, ధగధగా మెరిస్తున్న కిరీటం ధరించిన 'యమ' వేషధారి గంభీరమైన అడుగులు వేస్తూ... జనాల్ని బయటకి రావద్దంటూ హెచ్చరికలు చేస్తూ సందడి చేశాడు. ఆయన వెంటే స్వీ‌వ్‌లెస్ టాప్, ఊదా రంగు పైజమా, ఒంటి నుండా నీలిరంగు పెయింట్ పూసుకున్న కరోనా భూతం కూడా ముందుకు కదిలింది.


ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం, బీహార్‌లో ఇంతవరకూ 66 కోవిడ్ పాజివ్ కేసులు నమోదు కాగా, వీరిలో 29 మంది డిశ్చార్చ్ అయ్యారు. ఒకరు మృత్యువాత ప్డడారు. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య బుధవారంనాడు 11,439కి చేరుకోగా, వీటిలో 9,756 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 377 మంది ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - 2020-04-15T21:19:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising