ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లులకు.. హగ్‌ ఇవ్వొద్దు

ABN, First Publish Date - 2020-05-10T18:10:33+05:30

వారం రోజులు ఊరెళితే అమ్మను చూడకుండా ఉండలేం. మాట్లాడకుండా అస్సలు ఉండలేం. ఇంటికి వచ్చిన వెంటనే ఆమెను హత్తుకుంటాం. ఆనందంతో తల్లీబిడ్డలిద్దరూ మురిసిపోతారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వారం రోజులు ఊరెళితే అమ్మను చూడకుండా ఉండలేం. మాట్లాడకుండా అస్సలు ఉండలేం. ఇంటికి వచ్చిన వెంటనే ఆమెను హత్తుకుంటాం. ఆనందంతో తల్లీబిడ్డలిద్దరూ మురిసిపోతారు. ఇక, మదర్స్‌డే వచ్చిందంటే.. పాశ్చాత్యదేశాల్లో హగ్‌లు ఇచ్చుకోవడం సహజం. కరోనా వల్ల సామాజిక దూరం పాటించక తప్పడం లేదు. ‘మదర్స్‌డే శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చే పిల్లలు.. తల్లికి హగ్‌ ఇవ్వకూడదు. అలాచేస్తే ఆమె ప్రాణాలకే ముప్పు తెచ్చినవాళ్లు అవుతారు’ అంటూ ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మదర్స్‌డే వేడుకను కూడా పదిమందికి మించి చేసుకోవద్దంటూ హెచ్చరించింది.


తల్లులకు ఎలాంటి కానుకలు ఇవ్వకూడదు. పూలబొకేలు కూడా దూరం నుంచే అందివ్వాలి. ఇంట్లో అందరూ ఒకటిన్నర మీటరు దూరం నుంచే అమ్మకు శుభాకాంక్షలు చెప్పాలి. ఎందుకంటే వయసు మీదపడిన మాతృమూర్తులకు కరోనా సులభంగా సోకే ప్రమాదం ఉంది.. పిల్లలూ జాగ్రత్త అంటూ ఆ ప్రభుత్వం సూచించింది. మదర్స్‌డే రోజున అమ్మను హగ్‌ చేసుకోవద్దంటూ ఒక దేశ ప్రభుత్వం.. ఇలా అధికారికంగా ఆదేశాలు జారీచేయడం బహుశా ఇదే తొలిసారి అనుకుంటా. 

Updated Date - 2020-05-10T18:10:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising