ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనశ్శాంతి లేదు!

ABN, First Publish Date - 2020-06-25T05:30:00+05:30

నా వయసు 52 సంవత్సరాలు. ‘ఆంధ్రజ్యోతి’లో మీ సమాధానాలు చదువుతూ ఉంటాను. నా సమస్యకు కూడా జవాబు ఇస్తారని రాస్తున్నాను. లాక్‌డౌన్‌ మొదలుపెట్టిన తొలి రోజుల్లో మా మామగారు కళ్ళు తిరిగి పడిపోయారనీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నా వయసు 52 సంవత్సరాలు. ‘ఆంధ్రజ్యోతి’లో మీ సమాధానాలు చదువుతూ ఉంటాను. నా సమస్యకు కూడా జవాబు ఇస్తారని రాస్తున్నాను. లాక్‌డౌన్‌ మొదలుపెట్టిన తొలి రోజుల్లో మా మామగారు కళ్ళు తిరిగి పడిపోయారనీ, వెంటనే రావాలనీ నా భార్యకు ఫోన్‌ వచ్చింది. ఆమె బంధువులందరికీ ఫోన్లు చేసి, కారు మాట్లాడుకొని వెళ్ళిపోయింది. నాకు చెప్పలేదు, నా అభిప్రాయం అడగలేదు. ‘‘వెళ్లిపోవాలని డిసైడ్‌ అయ్యాను!’’ అంది. ‘సరే! తండ్రి కదా!’ అనుకొని ఊరుకున్నాను. నెలరోజులు ఎదురు చూసినా తిరిగి రాలేదు. లాక్‌డౌన్‌ వల్ల బయట హోటళ్ళలో తినడానికి అవకాశం లేదు. ఇంట్లో పని మొత్తం చేసుకోలేక, వంట రాక, చేయకపోతే నీరసంతో సతమతం అయ్యాను. పైగా ఆన్‌లైన్‌ క్లాసులు, పరీక్షలు... (నేను టీచర్‌గా ఉద్యోగం చేస్తున్నాను). నా భార్యకు ఫోన్‌ చేస్తే ‘మరో రెండు, మూడు నెలల దాకా రాను’ అంది. ఒంటరితనం, ఇంటి పని, చిత్తక్షోభ భరించలేక ఆత్మహత్య చేసుకుంటానని నా భార్యకు ఫోన్‌ చేసి చెప్పాను. అప్పుడు వచ్చింది నా దగ్గరకు! ఆమె వెళ్ళడానికి ఎక్కువ సహాయ పడింది నా అన్న కొడుకు అని తెలిసింది. ‘‘నా ఇష్టం లేకుండా నా భార్యను ఎందుకు పంపావు? నా గురించి ఆలోచించలేదా?’’ అని నిలదీశాను. అతను తీవ్ర పదజాలంతో నన్ను దూషించాడు. కక్ష కట్టినట్టు మా అబ్బాయికి నా గురించి చెడుగా చెప్పాడు. మా అబ్బాయి కూడా నన్ను దూషించాడు. ఆమెను రప్పించుకోవడానికి ఆత్మహత్య నాటకం ఆడానని అన్నాడు. నా భార్య వచ్చిన దగ్గర నుంచీ నాతో మాట్లాడడం లేదు. మొక్కుబడిగా వంట చేసి ఊరుకుంటోంది. అందరూ నన్ను శత్రువులా చూస్తున్నారు. నా భార్య నాకు ప్రయారిటీ ఇవ్వాలని ఆశించడం తప్పా? నా దగ్గర ఉండాలని అనుకోవడం తప్పా? నాకు మనశ్శాంతి లేకుండా ఉంది. సరైన సలహా ఇవ్వగలరు.

- కృష్ణ


పవిత్రమైన, బాధ్యతాయుతమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. పిల్లలకు తగాదాలు వస్తే తీర్చాల్సినవారు ఇంత చిన్న విషయానికి అంతగా మథనపడుతున్నారెందుకు? కన్నతండ్రికి బాగా లేదనగానే వెళ్లాలని ఎవరికైనా అనిపిస్తుంది. మిమ్మల్ని అడగలేదనడం నమ్మశక్యంగా లేదు. బహుశా మీరు తేలికగా తీసుకొని ఉంటారు. దాంతో బంధువుల సాయంతో  ఆవిడ వెళ్లి ఉంటారు. ఎలాగూ లాక్‌డౌన్‌ కదా... మీకు స్కూల్‌ లేదనుకుని ఉంటారు. క్లాసులు ఈ మధ్యనే కదా మొదలయ్యాయి. మీరు కనీసం ఆవిడ వెళ్ళాక ఫోన్‌ చేసి, మామగారి పరిస్థితి కనుక్కున్నారా? ఒకసారి వెళ్లి చూశారా? ఎంతసేపూ మీ కష్టాలే గానీ మీ భార్య మనోభావం ఏమిటో తెలుసుకున్నట్టు లేరు. పైగా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం ఏమిటి? అందుకే ఆమె మనసు గాయపడి ఉంటుంది. ఎంతసేపూ మీ స్వార్థం చూసుకుంటున్నారని అనిపించిందేమో! ఇప్పటికైనా మీ భార్యతో వివరంగా మాట్లాడండి. మీ తప్పు ఒప్పుకోండి. మీకు ఆమె తోడు ఎంత అవసరమో వివరించండి. మీ కష్టాలల్లో ఆమె తోడు ఉండడమే కాదు, మీ భార్య కష్టాల్లోనూ, సుఖాల్లోనూ మీరు తోడుగా ఉండాలి. లేకపోతే పెళ్లినాటి ప్రమాణాలకు అర్థం లేదు


-కె.శోభ, ఫ్యామిలీ కౌన్సెలర్‌, 

‘హార్ట్‌ టు హార్ట్‌’, shobhas292@gmail.com


Updated Date - 2020-06-25T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising