ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏం చేయాలో తెలియడం లేదు!

ABN, First Publish Date - 2020-07-09T05:30:00+05:30

నేను ఏడేళ్ళ క్రితం బీటెక్‌ పూర్తిచేశాను. అయిదేళ్ల క్రితం పెళ్లయింది. మా వారికి అమెరికాలో ఉద్యోగం. పెళ్లయినప్పటి నుంచి అక్కడే ఉంటున్నాం. మూడేళ్ళ బాబు ఉన్నాడు. మా అత్తమామలు హైదరాబాద్‌లో ఉంటారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేను ఏడేళ్ళ క్రితం బీటెక్‌ పూర్తిచేశాను. అయిదేళ్ల క్రితం పెళ్లయింది. మా వారికి అమెరికాలో ఉద్యోగం. పెళ్లయినప్పటి నుంచి అక్కడే ఉంటున్నాం. మూడేళ్ళ బాబు ఉన్నాడు. మా అత్తమామలు హైదరాబాద్‌లో ఉంటారు. నేను ఉద్యోగం చెయ్యడం లేదని మావారు, అత్తగారు నన్ను మాటలతో హింసిస్తున్నారు. ఒక్కోసారి మావారు అనే మాటలకు డిప్రెషన్‌లోకి వెళుతూ ఉంటాను. వాళ్ళది బాగా స్థిరపడిన కుటుంబమే. నేను ఉద్యోగం చెయ్యకపోతే ఇండియా వెళ్లిపోదామంటున్నారు మా ఆయన. అక్కడికి వచ్చి, అత్తగారి మాటలు భరిస్తూ ఉండలేను. నాకూ ఉద్యోగం చేయాలనే ఉంది. కానీ గైడెన్స్‌ లేదు. ఏం చేయాలో ఎలా చేయాలో తెలియడం లేదు. ఈ విషయంలో నా భర్త నుంచి ఏ సహాయమూ అందడం లేదు.

- కమల

బహుశా చదువైన వెంటనే పెళ్లి కోసం తొందర చేసి ఉంటారు మీ ఇంట్లో! మీరు కూడా అమెరికాలో అలవాటుపడే లోగానే బాబు బాధ్యతతో బిజీ అయి ఉంటారు. అయితే ఇవన్నీ మీ వారికీ, అత్తగారికీ తెలిసిన విషయాలే కదా! ఎందుకు మిమ్మల్ని తప్పు పడుతున్నారు? చాలామంది పెళ్లయి, పిల్లలు పుట్టగానే ఇక చెయ్యడానికేమీ లేదన్నట్టు ఉంటారు. ఆ ఒత్తిడిలో మీ భర్త ఏదన్నా అన్నారేమో? నిజానికి చాలామంది ఇంట్లో నుంచే పనిచేస్తున్నారు. ప్రయత్నిస్తే అదేమీ కష్టం కాదు. మీతో చదువుకున్న వారు, స్నేహితులు ఉంటే సంప్రతించండి. మీ ఆసక్తిని బట్టి ఎటువంటి ఉద్యోగం కోరుకుంటున్నారో నిర్ణయించుకోండి. అవసరమైతే కొత్త కోర్సులు నేర్చుకోండి. లేదా జాబ్‌ ప్లేస్‌మెంట్‌ సంస్థలను సంప్రతించండి. మనసుండాలే గానీ ఎన్నో రకాల ఉద్యోగాలు. జాబ్‌ వచ్చేలోపు మీకంటూ వ్యాపకం పెట్టుకోండి. ఆరోగ్యం, వ్యాయామాలకు ప్రాధాన్యం ఇవ్వండి. అంతేగానీ మీ భర్త ఏదో అన్నారనో, అత్తగారు తిట్టారనో బాధపడుతూ కూర్చుంటే మీకు మరింత నష్టం కలుగుతుంది. ఒకసారి మీ భర్తతో వివరంగా మాట్లాడి నిర్ణయించుకోండి.

-కె.శోభ, ఫ్యామిలీ కౌన్సెలర్‌, ‘హార్ట్‌ టు హార్ట్‌’, 

shobhas292@gmail.com


Updated Date - 2020-07-09T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising