కొత్త జీవితాన్ని ఆరంభించండి!
ABN, First Publish Date - 2020-11-30T06:47:43+05:30
ఇష్టమైన వాళ్లు దూరమైతే బాధగానే ఉంటుంది. అయితే ఆ విషయం గురించే ఆలోచిస్తూ కుంగిపోకూడదు. ముఖ్యంగా ప్రేమించిన వ్యక్తితో బ్రేకప్ అయినప్పుడు కుంగిపోకుండా కొత్త జీవితం ప్రారంభించాలి...
ఇష్టమైన వాళ్లు దూరమైతే బాధగానే ఉంటుంది. అయితే ఆ విషయం గురించే ఆలోచిస్తూ కుంగిపోకూడదు. ముఖ్యంగా ప్రేమించిన వ్యక్తితో బ్రేకప్ అయినప్పుడు కుంగిపోకుండా కొత్త జీవితం ప్రారంభించాలి. మీ స్థానంలో మరో వ్యక్తి ఉన్నంత మాత్రాన అదే ఆలోచనల్లో ఉండిపోకూడదు.
- ప్రతి బంధం ప్రత్యేకమైనది, విలక్షణమైనది. మీ స్థానంలోకి ఎవరో కొత్త వ్యక్తి వచ్చినంత మాత్రాన మీ స్థానాన్ని వాళ్లు భర్తీ చేశారని అనుకోవద్దు.
- పాత జ్ఞాపకాలు తొందరగా చెరిగిపోవు. ఆ జ్ఞాపకాలున్నా వాటితో భవిష్యత్తును గందరగోళానికి గురిచేయవద్దు. జీవితంలో ముందుకెళ్లడం ఆపొద్దు.
- తప్పు ఎవరిదైనా ఆ సంఘటనల నుంచి ఎంతో కొంత నేర్చుకోవాలి. అప్పుడే మీరు మరింత దృఢంగా మారతారు.
- జరిగిందే ఆలోచిస్తూ కూర్చోకూడదు. వాళ్లు ఏం చేస్తున్నారో అని ఆలోచిస్తూ కూర్చోవడం మూర్ఖత్వమే అవుతుంది. అనవసర విషయాలపై సమయాన్ని వృథా చేసుకోకూడదు. ఆలోచనలను నియంత్రించుకోవాలి.
Updated Date - 2020-11-30T06:47:43+05:30 IST