ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అతణ్ణి అంచనా వేయడం ఎలా?

ABN, First Publish Date - 2020-03-19T06:48:01+05:30

ఓ పక్క అతన్నే చేసుకోవాలని ఉంది. అందుకే క్షమార్హం కాని తప్పు చేసినా క్షమిద్దాం అనుకుంటున్నారు. మరోపక్క పెళ్లయ్యాక ఇలా ఉంటే ఎలా అనే సందిగ్ధం. ఎందుకొచ్చిన కష్టాలు? పెద్దవాళ్లు చెప్పినట్టు చేస్తే సరి అని మరోపక్క.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేను ఎనిమిదేళ్లుగా ఒకతణ్ణిప్రేమిస్తున్నాను. అతను కూడా నాతో చాలా ప్రేమగా ఉంటాడు. మా కులాలు వేరు. అయినా ఇంట్లో పెద్దవారితో చెప్పాం. ఒప్పుకుంటేనే పెళ్లి. ఈలోగా అతనికి ఇంకో అమ్మాయితో సంబంధం ఉందని తెలిసింది. అడిగితే ‘అనుకోకుండా జరిగిందని, నన్ను బాగా చూసుకుంటా’అని అంటున్నాడు. అందరూ అతని గురించి మంచిగానే చెబుతారు. నాకూ అతణ్ణే  పెళ్లి చేసుకోవాలని ఉంది. కానీ నా అంత సిన్సియర్‌గా అతను ప్రేమించడం లేదేమోనని ఎక్కడో అనిపిస్తోంది. అతనికి తల్లితండ్రులు లేరు. నాదేమో పెద్ద కుటుంబం. ఆస్తి కూడా బాగానే ఉంది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియడం లేదు. 

-చిన్ని

ఓ పక్క అతన్నే చేసుకోవాలని ఉంది. అందుకే క్షమార్హం కాని తప్పు చేసినా క్షమిద్దాం అనుకుంటున్నారు. మరోపక్క పెళ్లయ్యాక ఇలా ఉంటే ఎలా అనే సందిగ్ధం. ఎందుకొచ్చిన కష్టాలు? పెద్దవాళ్లు చెప్పినట్టు చేస్తే సరి అని మరోపక్క. అంటే మీకే స్థిరమైన అభిప్రాయం లేదు. అతన్ని చేసుకుంటే ఒకలా, చేసుకోకపోతే ఇంకోలా మనసుని మభ్యపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అంత కష్టపడకండి. పెళ్లికి ముందే తప్పు చేసి నిర్భయంగా ఒప్పుకున్నాడు అంటే మరోసారి అదే దారిలో వెళ్లడని ఎంటీ? ఇలా భయంతో, అనుమానంతో పెళ్లి చేసుకున్నా మనశ్శాంతి ఉండదు. అందుచేత అతనితో తెగతెంపులు చేసుకుని పెద్దవాళ్లు చెప్పిన సంబంధం చేసుకుంటే మేలేమో ఆలోచించండి.

- కె.శోభ,  ఫ్యామిలీ కౌన్సెలర్‌, హార్ట్‌ టు హార్ట్‌

shobhas292@gmail.com

Updated Date - 2020-03-19T06:48:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising