ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భరించే ఓపిక లేదు!

ABN, First Publish Date - 2020-07-02T05:18:27+05:30

నా వివాహమై ఏడున్నరేళ్ళయింది. మాకు ఆరేళ్ళ పాప. నేను ఎం.టెక్‌. చదివాను. ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తున్నాను. మేము నలుగురు ఆడపిల్లలం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నా వివాహమై ఏడున్నరేళ్ళయింది. మాకు ఆరేళ్ళ పాప. నేను ఎం.టెక్‌. చదివాను. ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తున్నాను. మేము నలుగురు ఆడపిల్లలం. మా అమ్మానాన్న మా అందరినీ చక్కగా చదివించారు. మా ఇంట్లో ఎప్పుడూ గట్టిగా మాట్లాడుకోవడం, పోట్లాడుకోవడం తెలీదు. కానీ, నా భర్త వాళ్ళ ఇంట్లో ఇవన్నీ సాధారణం. పెళ్లయిన కొద్దికాలానికే నా భర్తకు ఆడవాళ్ల మీద పెద్దగా గౌరవం లేదని అర్థమైంది. అరవడం, ఆ తర్వాత సారీ చెప్పడం అలవాటు. మా అత్తగారు కూడా ‘ఇవన్నీ మామూలే’ అనేవారు. ఇటువంటి వాతావరణం నాకు అలవాటు లేకపోవడంతో ఇబ్బందిగా ఉండేది. అయినా సర్దుకుపోయాను. నా జీతమంతా ఇంటికే ఖర్చు పెట్టాను. అయినా ఎప్పుడూ ఏదో ఒక గొడవ! ఆడవాళ్ళంటే అణిగిమణిగి ఉండాలనే స్వభావం అతనిది. లాక్‌డౌన్‌ సమయంలో గొడవలు ఇంకా పెరిగాయి. నా వల్ల కావడం లేదు. విడిపోవాలని బలంగా అనిపిస్తోంది. నా బలహీనత మా పాప. ఇదివరకు కూడా దూరంగా వెళ్ళాలనుకున్నాను.  పాప కోసం ఆగిపోయాను. అది అలుసుగా తీసుకొని అతను ఇంకా బెదిరిస్తున్నాడు. నా గురించి అబద్ధాలు చెబుతున్నాడు. బంధువుల ద్వారా రాజీకి ప్రయత్నించినా కుదరడం లేదు. ఇక అతణ్ణి భరించే శక్తి, సహనం నాలో ఏమాత్రం లేవు. పాప గురించే నా దిగులు. కోర్టును ఆశ్రయిస్తే పాపను నాకు ఇస్తారా?

- సుస్మిత


మీరు చక్కటి వాతావరణంలో పెరిగారు. కుటుంబంలో ఘర్షణలు, ఇబ్బందులు మీకు తెలీవు. అందుకే ఇంత మానసిక సంఘర్షణ. అయితే కష్టాలు ఉన్నప్పుడు ధైర్యంగా ఎదుర్కొన్న మీరు ఇప్పుడు విడిపోవాలనుకోవడమే కొద్దిగా ఆశ్చర్యం కలిగిస్తోంది. బహుశా మానసికంగా నలిగిపోయి ఉంటారు. ఈ పరిస్థితుల్లో కలసి ఉండడానికి కష్టపడాలి గానీ విడిపోవడానికి అక్కర్లేదు. ఎలాగూ మీరో నిర్ణయానికి వచ్చారు. పాప కోసం పెద్దవాళ్ల ద్వారా ప్రయత్నించండి. కోర్టు వారు కూడా పరిస్థితులు గమనించి, పాపకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారు. అయితే, ఏ నిర్ణయమైనా అన్ని రకాలుగా ఆలోచించి తీసుకోండి.

- కె.శోభ, ఫ్యామిలీ కౌన్సెలర్‌, ‘హార్ట్‌ టు హార్ట్‌’,  shobhas292@gmail.com

Updated Date - 2020-07-02T05:18:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising