అవగాహన పెరుగుతుంది!
ABN, First Publish Date - 2020-03-17T06:02:10+05:30
వరికి వారు చదువుకోవడం ఒక విధానం. అయితే, సామూహిక అధ్యయనం (గ్రూప్ స్టడీ)లో అంతకు పదింతల ప్రయోజనం ఉంటుంది. సమగ్రంగా అర్థం కావడానికి సామూహిక అధ్యయనం...
ఎవరికి వారు చదువుకోవడం ఒక విధానం. అయితే, సామూహిక అధ్యయనం (గ్రూప్ స్టడీ)లో అంతకు పదింతల ప్రయోజనం ఉంటుంది. సమగ్రంగా అర్థం కావడానికి సామూహిక అధ్యయనం అనేది ఒక సానుకూల విధానం.
సామూహిక అధ్యయనంలో పది మంది ఒకే చోట కూర్చున్నా ముందు తమలో తామే చదువుకుంటారు. ఒక స్థాయి అవగాహన ఏర్పడిన తర్వాత మిత్రులంతా పరస్పరం పంచుకోవడానికి సిద్ధమవుతారు.
పిల్లలు ఎవరికి వారు చదువుకునేటప్పుడు తనకు అర్థమయ్యిందే నూటికి నూరు శాతం కరెక్ట్ అన్న భావనకు లోనవుతారు. సామూహిక అధ్యయనంలో అలా ఉండదు. తనకు భిన్నంగా ఎదుటి విద్యార్థికి ఎలా అర్థమయ్యిందో తెలిసిపోతుంది.
ఒకసారి రాయడం అంటే అది 10 సార్లు చదవడానికి సమానం అంటారు. అలాగే గ్రూప్ స్టడీ అనేది 10 సార్లు తనలో తాను చదువుకోవడానికి సమానం.
సామూహిక అధ్యయనంలో అందరూ అన్నీ చదవాల్సిన అవసరం ఉండదు. ఒక్కొక్కరికి ఒక సబ్జెక్ట్ మీద పట్టు ఉన్నా దాన్ని మిగతవారు సులువుగా ఆకళింపు చేసుకునే అవకాశం లభిస్తుంది.
Updated Date - 2020-03-17T06:02:10+05:30 IST