ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిమిత విశ్రాంతే ఫలప్రదం!!

ABN, First Publish Date - 2020-02-10T06:18:02+05:30

శరీరమైనా, మనసైనా సహజంగా శ్రమను తక్కువగా, విశ్రాంతిని ఎక్కువగా కోరుకుంటుంది. పెద్దల మాదిరే పిల్లల్లోనూ ఈ పరిస్థితి ఉంటుంది. ఒత్తిళ్లు పెరిగిపోతున్నప్పుడు పిల్లల మనసు విశ్రాంతి కోసం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శరీరమైనా, మనసైనా సహజంగా శ్రమను తక్కువగా, విశ్రాంతిని ఎక్కువగా కోరుకుంటుంది. పెద్దల మాదిరే పిల్లల్లోనూ ఈ పరిస్థితి ఉంటుంది. ఒత్తిళ్లు పెరిగిపోతున్నప్పుడు పిల్లల మనసు విశ్రాంతి కోసం తపిస్తుంది. ప్రత్యేకించి పరీక్షల వేళల్లో ఆటవిడుపులా మధ్య మధ్య కొంత విశ్రాంతి అవసరమే గానీ, ఒక్కోసారి విశ్రాంతిలోకి వెళ్లిన మనసు మళ్లీ చదువులో పడటానికి అంత తొందరగా సిద్ధం కాదు. అందువల్ల ముందే అరగంటో, గంటో ఒక నిర్ణీత గడువు విధించుకోవడం చాలా అవసరం. కాకపోతే, విశ్రాంతి కోసం ఏదైనా మొదలెట్టడం, ఆ తర్వాత ముగించడం అంతా వారి చేతిలోనే ఉన్నప్పుడు అనుకున్నదే తడవుగా బయటపడటం సాధ్యమవుతుంది.


ఉదాహరణకు, మ్యూజిక్‌ వినడం, వాకింగ్‌, రన్నింగ్‌, స్విమ్మింగ్‌ లేదా సైక్లింగ్‌  చేయడం వంటివి, ఎవరికి వాళ్లు ఒక్కరుగా చేయగలిగేవి కదా! ఇలాంటివైతే ఎప్పుడంటే అప్పుడు ముగించుకుని, మళ్లీ చదువులో పడగలుగుతారు. అలా కాకుండా, క్రికెట్‌, వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, కబడ్డీ లాంటి ఆట ఏదైనా మొదలెడితే ముగించడం అనేది మొత్తం బృందం నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. అలాంటప్పుడు అరగంట అనుకున్న విరామ సమయం గంటదాకా వెళుతుంది. అందుకే పరీక్షల సమయంలో పిల్లల్ని ఒక్కరుగా ఆడుకునే ఆటలకే అనుమతించాలి. 


ఆటపాటల్లో ఉండే మరో అంశం ఏమిటంటే ఇవి మనిషిని ఉద్వేగానికి లోను చేస్తాయి. ఆ స్థితిలో ఆటను మధ్యలో మానేయడానికి మనసొప్పదు. ఏదో ఒక దశలో ఆపేసినా, ఆ ఆట తాలూకు జయాపజయాల ప్రభావం ఆట ముగిసిన తర్వాత కూడా కొనసాగుతుంది. అందుకే జయాపజయాలకు తావులేని ఆటలకే పిల్లలను అనుమతించాలి. అసలు పరీక్షలు అయిపోయేదాకా వారిని ఏ ఆటకు వెళ్లకుండా చూస్తే చాలు అనుకుంటే అది మరీ ప్రమాదం. దాంతో పిల్లల్లో ఒత్తిళ్లు మరీ ఎక్కువైపోయి, చదువు పైన మనసు లగ్నం కాదు. ఏదో కష్టంగా చదివినా జ్ఞాపకం ఉండవు. ఎప్పుడూ చదువుతున్నట్లే కనపడినా మార్కులు మాత్రం రావు. అందువల్ల పరీక్షల వేళల్లో కూడా పిల్లలకు విశ్రాంతి అవసరమేనన్నది వాస్తవం. అయితే, వారిని సామూహిక క్రీడల్లో కాకుండా, ఒక్కరుగా ఆడుకునే లేదా ఆస్వాదించే ఆటలకే పరిమితం చేయడం ఎక్కువ ప్రయోజన కరం!!

Updated Date - 2020-02-10T06:18:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising