ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒత్తిడి తాత్కాలికమే!

ABN, First Publish Date - 2020-03-19T06:27:29+05:30

పరీక్షలకు దాదాపు నెల రోజుల ముందు నుంచే చదవడంలో కాస్త సీరియస్‌నెస్‌ పెరుగుతుంది. ఒక సబ్జెక్ట్‌ తర్వాత ఒక సబ్జెక్ట్‌ చదవడం వల్ల ఒత్తిడికి గురైన భావనా కలుగవచ్చు కానీ, అదంతా తాత్కాలికమేనన్న విషయాన్ని పిల్లలకు అప్పుడప్పుడు చెబుతూ ఉండాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరీక్షలకు దాదాపు నెల రోజుల ముందు నుంచే చదవడంలో కాస్త సీరియస్‌నెస్‌  పెరుగుతుంది. ఒక సబ్జెక్ట్‌ తర్వాత ఒక సబ్జెక్ట్‌ చదవడం వల్ల ఒత్తిడికి గురైన భావనా కలుగవచ్చు కానీ, అదంతా తాత్కాలికమేనన్న విషయాన్ని పిల్లలకు అప్పుడప్పుడు చెబుతూ ఉండాలి. 

* సబ్జెక్టులన్నీ వరుసగా చదవడం వల్ల ఎంత కలగాపులగంగా అనిపించినా, పరీక్షలు దగ్గరపడే కొద్దీ దేనికదిగా పూర్తిగా విడదీసుకునే శక్తి మెదడుకు ఉంటుందనే వాస్తవాన్ని పిల్లలకు తెలియచేయాలి. విద్యాశాఖ కూడా అన్నింటికన్నా ముందు భాషా సబ్జెక్ట్‌లను పెట్టడంలోని ఉద్దేశం అదే!

* తెలుగు సబ్జెక్ట్‌ను ముందుగా పెట్టడం వల్ల అప్పటిదాకా ఉన్న ఒత్తిడి అంతా పోయి, పరీక్షలు మొదలవ్వగానే ఉల్లాసం మొదలవుతుంది. ఎందుకంటే అది మాతృ భాష. మిగతా సబ్జెక్ట్‌ల విషయానికి వస్తే ‘ఏది ఇష్టమైనది?, ఏది కాదు?’ ఇలాంటి ప్రశ్నలు వస్తే రావచ్చు. కానీ, మాతృభాష విషయంలో అవేమీ ఉండవు. దాదాపు అందరికీ అది ఇష్టమైనదిగానే ఉంటుంది. కాబట్టి అయోమయం గానీ, ఒత్తిడి గానీ ఉండవు.

* కొందరికి గద్యం అంటే ఇష్టమైతే, మరికొందరికి పద్యమంటే ఇష్టంగా ఉంటుంది. పద్యంలోని సౌలభ్యం ఏమిటంటే, పద్యంలోని తొలిపాదం గుర్తుకొస్తే మిగతా పాదాలన్నీ అవలీలగా గుర్తుకొస్తాయి. ఛందస్సు కారణంగా అది ఒక లయబద్ధంగా ఉండడమే అందుకు కారణం. పద్యం గుర్తుకు రావడం అంటే అందులోని భావమంతా గుర్తుకొస్తుంది. 

* పద్య సాహిత్యాన్ని ఆకళింపు చేసుకోవాలంటే, ప్రతిపదార్థ తాత్పర్యం తెలిసి ఉండడం తప్పనిసరి. పద్యమేదైనా అర్థం కావడంలో ఆలస్యం అవుతోందీ అంటే, అందులోని ఎక్కువ పదాలకు అర్థం తెలియదని అర్థం. 

* పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యేప్పుడు ఎక్కడ ఏ పదం తెలియకపోయినా వెంటనే నిఘంటువు చూసే ఓపిక ఉండాలి. కొన్ని కీలకమైన పదాలకు అర్థం తెలియకపోతే, వాక్యమే ముందుకు సాగదు. అందువల్ల అవసరమైనప్పుడు నిఘంటువు చూడటం విధిగా పెట్టుకోవాలి. 

* నాన్‌డిటైల్డ్‌ అయితే కథలోని ప్రధానమైన మలుపులను గుర్తుంచుకుంటే చాలు మొత్తం కథ గుర్తుకొచ్చేస్తుంది.

Updated Date - 2020-03-19T06:27:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising