స్మార్ట్‌ఫోన్‌తో బిజీగా ఉన్నారా?
ABN, First Publish Date - 2020-02-24T08:21:55+05:30
ఈకాలం పిల్లల్లో ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోన్ కనిపిస్తుంది. కొందరికి ఫోన్ ఉపయోగం వ్యసనంగానూ మారింది. ఫలితంగా వారి చదువు, ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుందంటోంది ఒక అధ్యయనం.
ఈకాలం పిల్లల్లో ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోన్ కనిపిస్తుంది. కొందరికి ఫోన్ ఉపయోగం వ్యసనంగానూ మారింది. ఫలితంగా వారి చదువు, ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుందంటోంది ఒక అధ్యయనం. ఫోన్‌లో ఎక్కువ సమయం గడిపే పిల్లల్లో ఒంటరితనం, ఉద్రేకం వంటి లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు పరిశోధకులు. అంతేకాదు చదువు పట్ల తక్కువ ఆసక్తి చూపిస్తారని, పరీక్షలంటే కంగారు పడతారని చెబుతున్నారు. లండన్‌లోని స్వన్సీయ యూనివర్సిటీ పరిశోధకులు ఆరోగ్యానికి సంబంధించిన డిగ్రీ కోర్సులో చేరిన 285మంది విద్యార్థుల మీద తాము చేసిన అధ్యయన ఫలితాలను కంప్యూటర్ అసిస్టెడ్ జర్నల్‌లో ప్రచురించారు. విద్యార్థులు డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించే తీరు, వారిలో ఉద్రేకం, ఒంటరితనం, చదువులో ప్రతిభ, కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన వంటివి ఏ స్థాయిలో ఉన్నాయో పరిశీలించారు. ‘‘ఇంటర్నెట్ వినియోగానికి అలవాటు పడిన విద్యార్థులు తమను తాము మోటివేషన్ చేసుకోవడంలో విఫలం అవుతున్నారు. ఫలితంగా చదువులో మెరుగైన ప్రదర్శన చేయలేకపోతున్నారు’’ అని చెబుతున్నారు ఫిల్ రీడ్ అనే పరిశోధకుడు.
Updated Date - 2020-02-24T08:21:55+05:30 IST