ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘స్టార్టింగ్‌ ట్రబుల్‌’తో సమస్యే!

ABN, First Publish Date - 2020-02-24T08:17:40+05:30

పిల్లలు పరీక్షలు రాయడంలో ‘స్టార్టింగ్‌ ట్రబుల్‌’ సమస్య కొన్నిసార్లు ఇబ్బందిపెడుతుంది. పరీక్షలకు బాగా చదినినా, ఆన్సర్‌ ఎలా మొదలెట్టాలో తెలియని స్టార్టింగ్‌ ట్రబుల్‌తో పెన్ను ముందుకు కదలదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిల్లలు పరీక్షలు రాయడంలో ‘స్టార్టింగ్‌ ట్రబుల్‌’ సమస్య కొన్నిసార్లు ఇబ్బందిపెడుతుంది. పరీక్షలకు బాగా చదినినా, ఆన్సర్‌ ఎలా మొదలెట్టాలో తెలియని స్టార్టింగ్‌ ట్రబుల్‌తో పెన్ను ముందుకు కదలదు.  కొంతమంది పిల్లలేమో ప్రతి ఆన్సర్‌నూ బాగా రాయాలనుకుంటూ, సమయం గడిచిపోతున్నా ఏ ఒక్క జవాబు రాయకుండానే ఉండిపోతారు. 10 నిముషాలో, 20 నిమిషాలో గడిచిపోయాక ‘చాలా టైమ్‌ వేస్ట్‌ అయిపోయింది’ అనే బెంగతో ఆదరాబాదరాగా ఏదో ఒకటి రాయడానికి ఉపక్రమిస్తారు. దాంతో వేగంగా రాయలేకపోతారు. దిగులూ, ఆందోళన మనసులో నిండిపోయాక భాషాపరంగా, విషయపరంగానూ పెన్ను ముందుకు సాగదు. మరికొంతమంది పిల్లల్లో ఆన్సర్‌ షీట్‌ను చూడగానే నీరసించిపోయే ‘వైట్‌పేపర్‌ ఫోబియా’ ఉంటుంది. అలాంటివారికి ఆన్సర్‌ షీట్‌పై తొలి వాక్యం రాయడం ఒక యుద్ధంలాగే అనిపిస్తుంది. అందుకే భయంభయంగా, క ష్టంగా రాస్తూ ఉంటారు. 


ప్రతి రోజూ ఏదో ఒకటి రాసే ప్రాక్టీస్‌ లేని వారే ఈ తరహా ఇబ్బందులు పడుతుంటారు. అందువల్ల  రైటింగ్‌ ప్రాక్టీస్‌ అనేది నిత్యకృత్యంగా ఉండాలి. పరీక్షలకు కొద్ది వారాల ముందు నుంచైనా పిల్లలతో రాయించడం ప్రాక్టీస్‌ చేయించాలి. ప్రశ్నపత్రం అందుకోగానే ఆన్సర్‌ రాయడం మొదలెట్టేలా పిల్లలకు విధిగా  శిక్షణ ఇవ్వాలి. ఫస్ట్‌ ఇంప్రెషన్‌ బావుండాలనే భావన పిల్లల్లో కూడా ఉంటుంది. అందుకే అన్నింటికన్నా బాగా రాయగలిగే వాటితో మొదలు పెట్టాలనుకుంటారు. కాకపోతే ఏది బాగా రాయగ లరో తే ల్చుకోవడంలోనే ఎక్కువ సమయం గడిచిపోతుంది. ఒక్కోసారి బాగా చదివిన ఆన్సర్‌ కూడా తీరా రాద్దామనుకునే సరికి కొందరికి సరిగా గుర్తుకురాదు. ఈ పరిస్థితికి పరీక్షలకు ముందు రైటింగ్‌ ప్రాక్టీస్‌ చేయకపోవడం ప్రధాన కారణం. అందువల్ల నియమిత సమయంలోనే జవాబులన్నీ రాయగలగేలా పిల్లలను మొదటి నుంచీ తయారుచేయాలి.  వేగంగా రాయడానికైనా, స్టార్టింగ్‌ ట్రబుల్‌ను అదిగమించడానికైనా... పరీక్షల రోజు దాకా ఎంతో కొంత రైటింగ్‌ ప్రాక్టీస్‌ చేయించడం తప్పనిసరిగా భావించాలి. ఎవరైనా మెదడులో ఉన్న విషయాన్నంతా పేపర్‌పై పెట్టడం సులువైన పనేమీ కాదు.  ఎందుకంటే గుర్తుండటం, రాయడం... ఈ రెండూ పూర్తిగా  వేర్వేరు ప్రక్రియలు. బాగా చదివిన పిల్లలు కూడా బాగా రాయలేకపోవడానికి ఈ రెండూ వేర్వేరని గుర్తించకపోవడం ఒక ప్రధాన కారణం. అలా గుర్తించిన పిల్లలైతే, చదువుతో పాటు రైటింగ్‌ కూడా ప్రాక్టీస్‌ చేస్తారు. ఒకవేళ పిల్లల్లో ఆ అలవాటు లేకపోతే తలిదండ్రులైనా అలవర్చాలి. 

Updated Date - 2020-02-24T08:17:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising