ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆడపిల్లలకు అంకితం...

ABN, First Publish Date - 2020-03-10T06:33:04+05:30

గృహిణిగా ఇంటి నిర్వహణతో పాటు మెరుగైన సమాజాన్ని నిర్మించడంలో మహిళల పాత్ర, కృషిని వివరిస్తూ ఇండో టిబెటన్‌ బోర్డర్‌ ఫోర్స్‌ (ఐటీబీఎఫ్‌) తన అధికారిక ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ ఖాతాలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గృహిణిగా ఇంటి నిర్వహణతో పాటు మెరుగైన సమాజాన్ని నిర్మించడంలో మహిళల పాత్ర, కృషిని వివరిస్తూ ఇండో టిబెటన్‌ బోర్డర్‌ ఫోర్స్‌ (ఐటీబీఎఫ్‌) తన అధికారిక ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ ఖాతాలో తాజాగా పోస్ట్‌ చేసిన ఒక వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా విడుదల చేసిన ఈ పాటను ఐటీబీఎఫ్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తోన్న అర్జున్‌ ఖేరియాలా హిందీలో రాశారు. స్వతహాగా సంగీత ప్రియుడైన ఆయన స్వయంగా కంపోజ్‌ చేసి పాడిన ఈ పాటను ఆడపిల్లలకు అంకితం చేశారు. ‘లాడో.. మేరి లాడో..’ అంటూ సాగే ఈ వీడియో (‘లాడో.. మేరి లాడో’’ అంటే ‘నా గారాల బిడ్డ’ అని అర్థం) డ్యూటీలో భాగంగా దేశ రక్షణలో సైనికుడు చేసే త్యాగం, సైనికుడు, అతడి కుటుంబసభ్యుల మధ్య ఉండే ప్రేమను ప్రతిబింబింస్తుంది.


ఒక సైనికుడు సెలవుల్లో తన కుటుంబంతో గడిపే ఆనంద క్షణాలు, తిరిగి విధులకు వెళ్లే సమయంలో అతడితో పాటు కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురయ్యే దృశ్యాలు, సైనికుడు అతడి కూతురు మధ్య ఉండే అనుబంధాన్ని ఎంతో చక్కగా ఆవిష్కరించింది ఈ వీడియో. అంతేకాదు ఆడపిల్లలను చదివించాలనే సందేశాన్ని చాటింది. 7 నిమిషాల 24 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘బేటీ బచావో.. బేటీ పఢావో’ కార్యక్రమాన్ని ప్రమోట్‌ చేస్తోంది. ఈ వీడియోను యూట్యూబ్‌లో ఇప్పటికే 13వేలకు పైగా చూశారు.

Updated Date - 2020-03-10T06:33:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising