ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

100 వింటేజ్‌ కార్లు

ABN, First Publish Date - 2020-11-11T06:14:56+05:30

ఒక్కొక్కరిదీ ఒక్కో అభిరుచి. కొందరివి వింతగా ఉంటాయి. మరికొందరివి నమ్మలేమనిపిస్తాయి. కానీ ఈజిప్ట్‌కు చెందిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక్కొక్కరిదీ ఒక్కో అభిరుచి. కొందరివి వింతగా ఉంటాయి. మరికొందరివి నమ్మలేమనిపిస్తాయి. కానీ ఈజిప్ట్‌కు చెందిన సయ్యద్‌ సైమా అభిరుచి మాత్రం అసాధ్యమనిపిస్తుంది. ఆయనకు కార్లంటే పిచ్చి. అది కూడా వింటేజ్‌ (పురాతన) కార్లంటే తగని మోజు. వాటిని సేకరించడం ఆయనకు ఒక అలవాటు. అందులో ఏముంది! అలాంటివాళ్లు ప్రపంచంలో చాలామందే ఉన్నారు కదా! వాళ్ల దగ్గర మహాఅయితే ఓ పది లోపు ఉంటాయి. మరి సయ్యద్‌ సైమా వద్ద..? ఏకంగా వందకు పైగా వింటేజ్‌ కార్లున్నాయి.


అదెలా అంటే... ఆయనకు 25 ఏళ్లప్పటి నుంచి అదే పనిగా పెట్టుకున్నాడు. ‘పురాతన కార్లపై ప్రేమో, పిచ్చో ఉంటే నచ్చినవి రెండు మూడు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొంటారు ఎవరైనా. మరి ఈయనేంటి షెడ్డులో పదుల సంఖ్యలో బారులు తీర్చాడు’ అనేవాళ్లు అనేకం. ఇవేవీ పట్టించుకోడు సయ్యద్‌ సైమా. ఆ కార్ల అందం, అరుదైన మోడల్‌కు ఆయన పడిపోతాడు. వెంటనే తెచ్చుకుని గ్యారేజీలో పెట్టే వరకూ నిద్రపోడు. వీటిల్లో కొన్నింటిని ఈజిప్టియన్‌ మీడియా ప్రొడక్షన్‌ సిటీలో పెట్టాడు. వాటిని సినిమావాళ్లు షూటింగ్‌లకు వాడుకొంటుంటారు. 



అతడి దగ్గర ఉన్నవాటిల్లో పురాతనమైనది ‘ఆబర్న్‌’. 1980ల్లో దీన్ని సొంతం చేసుకున్నాడు. ‘‘అత్యంత అరుదైన కారు ఇది. పూర్తిగా కలపతో చేసింది. దానిపై స్టీల్‌ కోటింగ్‌. చూడగానే ఎవరైనా మనసు పారేసుకోవాల్సిందే’’ అంటాడు సయ్యద్‌. ఆయన కార్లలో ఒకటైన షెవర్లే ఇంపాలాను 1975లో ఈజిప్ట్‌ మాజీ అధ్యక్షుడు అన్వర్‌ ఇ సాదత్‌ నడిపారట. అప్పుడది ఆయన ప్రెసిడెన్షియల్‌ కారు. సయ్యద్‌ అందమైన కార్లను చూస్తూ పెరిగాడు అతడి కొడుకు అయ్‌మన్‌ కూడా.


‘‘యువకుడిగా ఉన్నప్పుడు నాన్నకు కార్ల సేకరణపై ఆసక్తి పెరిగింది. నాన్నకే కాదు... కార్లంటే నాకూ ఇష్టమే. ఏ కుర్రాడికి మాత్రం ఉండదు... అందమైన కారు కనిపిస్తే ఓ రౌండ్‌ వేసొద్దామని! నేనూ అలానే! సమయం దొరికినప్పుడల్లా నచ్చిన కారులో షికారుకెళుతుంటా. ఇక మా కార్లను సినిమా స్ర్కీన్‌పై చూస్తున్నప్పుడు ఆ అనుభూతి అద్భుతంగా ఉంటుంది’’ అంటాడు అయ్‌మన్‌. 

అన్నట్టు ‘సైమా’ అంటే ఈజిప్టియన్‌ మాండలికంలో ‘సినిమా’ అని అర్థం. మనోడి గ్యారేజీకి వెళితే ఐదు దశాబ్దాలకు పూర్వం కార్లు కొలువుదీరి ఉంటాయి. ఒక్కోదానికి ఒక్కో చరిత్ర. అది తెలుసుకొంటూ అందులో ఓ రౌండ్‌ వేస్తే నిజంగానే ఓ ‘సైమా’... అదే ‘సినిమా’ చూసిన అనుభూతి కలుగుతుంది. 

Updated Date - 2020-11-11T06:14:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising