కోరుకున్న డిజైన్
ABN, First Publish Date - 2020-10-07T06:34:56+05:30
డ్రెస్సింగ్ స్టయిల్స్ పక్కాగా ఫాలో అయ్యేవారు పాదరక్షల విషయంలో అంతే నిక్కచ్చిగా ఉంటారు. కాలికి వేసుకొనేవే కదా అని ఏదోఒకదాంతో సరిపెట్టుకోరు. ట్రెండీ లుక్ కోరుకొంటారు...
డ్రెస్సింగ్ స్టయిల్స్ పక్కాగా ఫాలో అయ్యేవారు పాదరక్షల విషయంలో అంతే నిక్కచ్చిగా ఉంటారు. కాలికి వేసుకొనేవే కదా అని ఏదోఒకదాంతో సరిపెట్టుకోరు. ట్రెండీ లుక్ కోరుకొంటారు. కానీ మార్కెట్‌కు వెళితే అలాంటివేవీ కనిపించవు. చేసేది లేక ఉన్నవాటిల్లోనే ఒకటి కొనితెచ్చుకొంటారు. ఈ అనుభవమే రాహుల్‌దేవ్‌కూ ఎదురైంది. స్వతహాగా ఆర్టిస్ట్ అయిన అతడు వెంటనే అమెజాన్‌లో ఉద్యోగానికి స్వస్తి చెప్పి, కస్టమైజ్డ్ షూస్ స్టోర్ తెరిచాడు.
షూ మీకు ఎలా కావాలంటే అలా తయారు చేస్తాడు. దానిపై కోరుకున్న రంగుల్లో డిజైన్లు అద్దుతాడు. ‘అన్‌హింగ్డ్ కస్టమ్స్’ పేరుతో ఏర్పాటు చేసిన అతడి ఆన్‌లైన్ స్టోర్‌కు మాంచి డిమాండ్ ఉందిప్పుడు. బాలీవుడ్ తార సోహా అలీఖాన్ తదితర సెలబ్రిటీలు కూడా రాహుల్ కస్టమర్లే. షూస్ ధరలు రూ.6 వేల నుంచి రూ.25 వేల వరకు ఉన్నాయి.
Updated Date - 2020-10-07T06:34:56+05:30 IST