బోర్న్ టు పెర్‌ఫామ్
ABN, First Publish Date - 2020-11-25T06:08:08+05:30
కసి, కృషి ఉండాలే కానీ ప్రతిభకు హద్దులు ఉండవు. ఈ చిత్రాలు అదే చెబుతున్నాయి. కాదు కాదు నిరూపిస్తన్నాయి. వీరంతా యువ కళాకారులు. కళలపై మక్కువ పెంచుకున్నవారు. కానీ దివ్యాంగులు. అయితేనేం... నాట్యంతో అదరగొడతారు. అది భరతనాట్యమైనా... భాంగ్రా అయినా... జిమ్నాస్టిక్స్‌ను తలపించే విన్యాసమైనా...
కసి, కృషి ఉండాలే కానీ ప్రతిభకు హద్దులు ఉండవు. ఈ చిత్రాలు అదే చెబుతున్నాయి. కాదు కాదు నిరూపిస్తన్నాయి. వీరంతా యువ కళాకారులు. కళలపై మక్కువ పెంచుకున్నవారు. కానీ దివ్యాంగులు. అయితేనేం... నాట్యంతో అదరగొడతారు. అది భరతనాట్యమైనా... భాంగ్రా అయినా... జిమ్నాస్టిక్స్‌ను తలపించే విన్యాసమైనా... మరే సంప్రదాయ కళలైనా ఎవరికీ తీసిపోరు. ‘యునెస్కో, ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్’లు వీరందరి ట్యాలెంట్‌ను ప్రపంచానికి ఘనంగా పరిచయం చేశాయి.
భారత్‌తో పాటు చైనా, కెనడా, కంబోడియా, ఇండోనేషియా, ఇరాన్, జపాన్, మలేషియా, మారిషస్, నేపాల్, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, శ్రీలంక, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, బ్రిటన్ తదితర దేశాలకు చెందిన దివ్యాంగ కళాకారులు ఇందులో భాగస్వాములయ్యారు. దేశవిదేశాల్లో వివిధ సందర్భాల్లో ఈయువ కళాకారులు ఇచ్చిన ప్రదర్శనలను తన కెమెరాతో బంధించారు ఢిల్లీకి చెందిన ఫిలిమ్ మేకర్, రచయిత, ఫొటోగ్రాఫర్ విజయ్ ఎస్ జోధా. వాటన్నింటినీ ఒక ఫొటో ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. ‘అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం’ సందర్భంగా ‘బోర్న్ టు పెర్‌ఫామ్’ పేరిట తాను ఏర్పాటు చేసిన ఈ ఆన్‌లైన్ ఫొటో ఎగ్జిబిషన్ నవతరానికి స్ఫూర్తిగా నిలిస్తుందంటారు విజయ్. ‘ఇక్కడి ఫొటోల్లో ఉన్నవారంతా ప్రపంచంలోనే అరుదైన, అద్భుతమైన కళాకారులు. వారి ప్రతిభ చూస్తుంటే వైకల్యం కనిపించదు’ అంటారాయన. నాలుగేళ్లుగా విజయ్ ఈ ప్రదర్శనలో తన ఫొటోలు ప్రదర్శిస్తున్నారు. వికలాంగుల హక్కులు, సమస్యలపైనా ఆయన ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు.
Updated Date - 2020-11-25T06:08:08+05:30 IST