ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోల... మళ్లీ మొదలైంది

ABN, First Publish Date - 2020-12-09T05:30:00+05:30

లాక్‌డౌన్‌ తరువాత స్నేహితులంతా కాలేజీకి బయలుదేరుతారు. దారిలో ఒకచోట కలుస్తారు. మిత్రుల్లో ఒకడైన ఉమ కనిపించకపోతే... కరోనా వచ్చి పోయాడని చెబుతాడు నీరజ్‌. తీరా చూస్తే అతడు ఎదురుపడతాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాక్‌డౌన్‌ తరువాత స్నేహితులంతా కాలేజీకి బయలుదేరుతారు. దారిలో ఒకచోట కలుస్తారు. మిత్రుల్లో ఒకడైన ఉమ కనిపించకపోతే... కరోనా వచ్చి పోయాడని చెబుతాడు నీరజ్‌. తీరా చూస్తే అతడు ఎదురుపడతాడు. ‘నాకు కరోనా సోకి పోయానని చెప్పింది ఎవర్రా’ అంటూ నీరజ్‌ను వంచి రెండు వడ్డిస్తాడు ఉమ. ఇంతలో కాలేజీ టాపర్‌ అటునుంచి వెళుతుంటే అతడిని పిలిచి ‘నువ్వు టాపర్‌వి అయ్యుండి ఇంకా కరోనాకు వ్యాక్సిన్‌ ఎందుకు కనిపెట్టలేదురా’ అంటూ ఆట పట్టిస్తారు. దానికి అతడు చికాగ్గా ‘అది కనిపెట్టేది సైంటి్‌స్టలురా... టాపర్లు కాదు’ అని క్లారిటీ ఇస్తాడు. కాసేపటికి ఇంకొక స్నేహితుడు కాళ్లు దూరంగా పెట్టి, కష్టంగా నడుస్తూ వస్తుంటాడు. ‘లాక్‌డౌన్‌లో పోలీసులతో కొట్టించుకున్నవాళ్లలో నువ్వు కూడా ఒకడివి కదా’ అంటూ నీరజ్‌ పంచ్‌ వేస్తాడు. కానీ అదే నిజం.


పోలీసులతో దెబ్బలు తినే అతడి పరిస్థితి అలా మారుతుంది. సీన్‌ కట్‌ చేస్తే... చాలా రోజుల తరువాత కాలేజీ క్లాస్‌రూమ్‌లోకి వెళ్లిన నీరజ్‌ ఆనందంతో ఎగిరి పిచ్చివాడిలా గంతులేస్తుంటాడు. ఖాళీ తరగతి గదిలో సెల్ఫీలు దిగి ఆనందిస్తుంటాడు. అది చూసిన అతడి బ్యాచ్‌... ‘పాపం ఇలా ఇంట్లో ఉండీ ఉండీ పిచ్చెక్కిపోయాడు’ అంటూ కాస్తంత ఆందోళనలో మరికాస్త వెటకారం జోడించి బాధపడుతుంటారు. క్లాస్‌ మొదలవుతుంది. వచ్చిన లెక్చరర్‌ను వచ్చినట్టు గోల చేస్తుంటారు నీరజ్‌ అండ్‌ గ్యాంగ్‌. ‘చెప్పండిరా... లాక్‌డౌన్‌లో ఏమి నేర్చుకున్నారు’... అడుగుతారు ఓ లెక్చరర్‌. ‘గుర్తుంచుకోండి. మనం పోరాడిల్సింది రోగితో కాదు, వ్యాధితో’ అంటూ మొదలెడతాడు ఒకడు. వేరొక విద్యార్థిని అడిగితే... అతడూ కరోనా జాగ్రత్తలే అప్పచెబుతుంటాడు. కాలేజీ గోల మళ్లీ మొదలైన ఆనందం అందరిలో. అలా సరదాగా సాగిపోతున్న కథలో చిన్న ట్విస్ట్‌. ఆ ట్విస్ట్‌ ఏమిటన్నది చూస్తేనే బాగుంటుంది. ఎందుకంటే అందులో ఓ చక్కని సందేశం ఉంది. ఈ చిత్రానికి కథ, మాటలు, ఎడిటింగ్‌, దర్శకత్వం తేజ. ‘ఇన్ఫినిటమ్‌ మీడియా’ రూపొందించిన ‘కాలేజీ ఆఫ్టర్‌ లాక్‌డౌన్‌’లో స్నేహితులుగా సాయితేజ, నీరజ్‌, ఉమామహేష్‌, మురళీకృష్ణ, నిశ్చల్‌ తదితరులు పాత్రల్లో ఇమిడిపోయారు. యూట్యూబ్‌లో విడుదలైన ఈ లఘుచిత్రాన్ని ఆరున్నర లక్షల మంది వీక్షించారు.


కాలేజీ ఆఫ్టర్‌ లాక్‌డౌన్‌ 

విడుదల: డిసెంబర్‌ 6 

కథ, మాటలు, దర్శకత్వం: తేజ 

వ్యూస్‌: 6.5 లక్షలు 


Updated Date - 2020-12-09T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising