ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రోషే కొత్తగా

ABN, First Publish Date - 2020-11-18T05:30:18+05:30

ఒక్కసారి అమ్మమ్మల కాలంలోకి వెళ్లండి..! వాళ్లు రకరకాల అల్లికలు ధరించేవారు. ఆ అల్లికలే ఇప్పుడు మళ్లీ మగువల స్పెషల్‌ అకేషన్‌ డ్రెస్‌లయ్యాయి. విభిన్న రంగులు, డిజైన్లలో ఉన్న క్రోషేలు ధరించి హాలీవుడ్‌, బాలీవుడ్‌ తారలు మురిపిస్తున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక్కసారి అమ్మమ్మల కాలంలోకి వెళ్లండి..! వాళ్లు రకరకాల అల్లికలు ధరించేవారు. ఆ అల్లికలే ఇప్పుడు మళ్లీ మగువల స్పెషల్‌ అకేషన్‌ డ్రెస్‌లయ్యాయి. విభిన్న రంగులు, డిజైన్లలో ఉన్న క్రోషేలు ధరించి హాలీవుడ్‌, బాలీవుడ్‌ తారలు మురిపిస్తున్నారు. వింటర్‌ కలెక్షన్‌గా ఫ్యాషన్‌ షోలలోనూ ఇవి మెరుస్తున్నాయి. తాజాగా ప్రముఖ అమెరికా మోడల్‌, సోషలైట్‌, పారిశ్రామికవేత్త అయిన కైలీ జెన్నర్‌ సూట్‌కు మ్యాచింగ్‌గా బ్రౌన్‌ కలర్‌ క్రోషే ధరించి ఆకట్టుకుంది. ఈ ఫొటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తే... అరకోటి మందికి పైగా ఫిదా అయిపోయారు. ‘స్టయిల్‌ అదిరింది’ అంటూ లైక్‌లపై లైక్‌లేసుకున్నారు.


జెన్నర్‌ మాత్రమే కాదు... ప్రియాంకా చోప్రా తదితర ప్రముఖ హిందీ తారలు సైతం వీటిల్లో అదరహో అనిపిస్తున్నారు. ఏదిఏమైనా కరోనా దెబ్బకు డిజిటల్‌ తెరలు ఎక్కిన క్యాట్‌వాక్‌ల్లో డిజైనర్లు మిషన్‌ మేడ్‌ ఫ్యాబ్రిక్‌ కంటే చేనేతలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వాటితోపాటే పర్యావరణానికి హాని చేయని ఎకోఫ్రెండ్లీ డ్రెస్స్‌లు రూపొందిస్తున్నారు.  

Updated Date - 2020-11-18T05:30:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising