ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొలిచూపులోనే ప్రేమ పుడుతుందా!

ABN, First Publish Date - 2020-09-30T06:19:34+05:30

లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌... చాలామంది ఈ భావనకు లోనయ్యే ఉంటారు. మొదటిసారి ఒకరిని చూడగానే గుండెలో ప్రేమ గంటలు మోగుతుంటాయి. అదే లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ అనుభూతి. అయితే నిజంగానే తొలి చూపులోనే ప్రేమ పుడుతుందా! కొన్ని కారణాల వల్ల మీలో ఆ భావన కలగవచ్చు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌... చాలామంది ఈ భావనకు లోనయ్యే ఉంటారు. మొదటిసారి ఒకరిని చూడగానే గుండెలో ప్రేమ గంటలు మోగుతుంటాయి. అదే లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ అనుభూతి. అయితే నిజంగానే తొలి చూపులోనే ప్రేమ పుడుతుందా! కొన్ని కారణాల వల్ల మీలో ఆ భావన కలగవచ్చు. అయితే అది నిజంగా ప్రేమేనా లేక ఆకర్షణా అన్నది ముందుగా నిర్ధారించుకోవాలి అంటున్నారు లవ్‌గురూలు. 


  1. ఆకర్షణా లేదా లిప్తపాటు భావనా: ప్రేమ అనేది అంతుచిక్కనిది. తొలిచూపులోనే ప్రేమ అనేది కూడా ఆలోచనలకు అందనిది. మీరు మొదటిసారి కలిసిన వ్యక్తిపై ప్రేమలో పడినట్టు మీకు అనిపించిందనుకోండి. అది నిజంగా ప్రేమ అవునో కాదో నిర్ధారించుకోండి. అయితే ఆ భావన ఆకర్షణ వల్ల కలిగిందయితే, కొద్దికాలం తరువాత కనుమరుగైపోతుంది. ఒక్కోసారి మీ ప్రేమ విరబూసేందుకు దారితీయవచ్చు. అయితే చూసి చూడంగానే ప్రేమ పుట్టడం జరగదు.
  2. గత అనుభవాలు: ఒక్కోసారి మనం కోరుకున్న వ్యక్తి దొరికారని అనిపిస్తుంది. ఒక్కసారి చూడగానే ప్రేమలో పడినట్టేనా! మనకు తెలియకుండానే మన మెదడు వారిని ప్రేమిస్తున్నామనే భావనను కలిగేలా చేస్తుంది. ఇలా అనిపించడానికి కారణం లేకపోలేదు. గతంలో ఎవరో ఒకరు మీ మనసును కదిలించి ఉంటారు. వారిని మీకు సరిజోడి అనుకొని ఉంటారు. అలాంటి భావనే ఇప్పుడు కలిసిన వ్యక్తిని చూడగానే అనిపించినప్పుడు మదిలో ప్రేమ సరాగాలు మొదలవడం మామూలే. 
  3. మనసులో కోరికలు: మనసులోని చాలా కోరికలను ఎక్స్‌ప్రెస్‌ చేయం. అవి మన మనసు లోతుల్లో అలానే ఉండిపోతాయి. అలాంటప్పుడు మీరు తొలిసారిగా కలిసిన వారిపై ప్రేమ భావన కలగడం సహజమే. మీరు కోరుకునే వ్యక్తిలో ఉండాల్సిన లక్షణాలపై అప్పటికే మీలో అవగాహన అందుకు కారణమవు తుంది. ఈ స్థితిలో ఆత్మపరిశీలన చేసుకొని నిర్ణయం తీసుకోవాలి.
  4.  అనుకూలతలు: కొత్తవాళ్లను మొదటిసారి చూసినప్పుడు ఒకరమైన పరవశం కలుగుతుంది. వారు మీతో మాట్లాడిన తీరు లేదా మీ జీవితం, ఇతర విషయాల్లో వారికి మీకు పోలిక ఉండడాన్ని మీరు గమనించడం వల్ల అలా అనిపిస్తుంది. ఇవన్నీ మీరు ఒకరికొకరు పర్‌ఫెక్ట్‌ జోడి అనే భావన కలిగిస్తాయి. అయితే ఒక నిర్ణయానికి వచ్చే ముందు అది ప్రేమా కాదా అన్నది గ్రహించడం చాలా ముఖ్యం.
  5. లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ అంటే: తొలిచూపులోనే ప్రేమ ఒక అందమైన అనుభూతి. మొదటిసారి చూడగానే అవతలి వారిపై అప్పటికప్పుడు అమితమైన ఇష్టాన్ని, అనుబంధాన్ని చూపించడమే లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌. అయితే దీన్ని అన్నిసార్లు కొట్టిపారేయ లేం. ఇంతకీ ఈ భావన నిజామా? కాదా? అనేది మీరు వారిని చూడగానే లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ అని ఎందుకు అనుకుంటున్నారో దానిపై ఆధారపడుతుంది. 




Updated Date - 2020-09-30T06:19:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising