ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రేమ పరవశం కోసం

ABN, First Publish Date - 2020-09-23T05:30:00+05:30

మనసు పడినంత సులువుగా మాట కలపలేం. ఇష్టపడిన వారితో మొదటిసారి మాట్లాడేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. వారి గురించి ఎంతో కొంత తెలిస్తే తప్ప

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనసు పడినంత సులువుగా మాట కలపలేం. ఇష్టపడిన వారితో మొదటిసారి మాట్లాడేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. వారి గురించి ఎంతో కొంత తెలిస్తే తప్ప నోరు పెగలదు. ఏం మాట్లాడాలి? ఏం అడగాలి? అనే సందిగ్ధం గుండె దడను పెంచేస్తుంది. అయితే కొన్ని ప్రశ్నల ద్వారా వారిని మరింత అర్థం చేసుకోవచ్చు. వారి మనసుపుటల్లోని భావాలను ఒక్కొక్కటిగా తెలుసుకోవచ్చు. అవేమిటంటే...


 మీ సెలబ్రిటీ క్రష్‌ ఎవరు? మీ మనసు కొల్లగొట్టిన వారి వ్యక్తిత్వం, వారు ఎలాంటి వారు వంటివి తెలుసుకోవాలనే ఆత్రం ఉంటుంది కదా! ముందుగా వారి సెలబ్రిటీ క్రష్‌ ఎవరో తెలుసుకోవడం ద్వారా వారి ఇష్టానిష్టాలు పసిగట్టవచ్చు. సినీతారలు, సినిమా కబుర్లతో వారితో మాటలు కలపాలి. అలానే మీకు ఉన్న సెలబ్రిటీ క్రష్‌ సంగతులు వారితో పంచుకోవాలి.


 పెద్ద పెద్ద పార్టీలకు వెళ్లేందుకు ఇష్టపడతారా? లేదా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారా! ఈ ప్రశ్న అడగడం ద్వారా మీరు మనసు పడిన వారు సిగ్గరినా! లేదా గడగడా మాట్లాడే వ్యక్తినా అనేది తెలిసిపోతుంది. అంతేకాదు వారికి ఎలాంటి పార్టీలు నచ్చుతాయి, వారు ఎలాంటి ప్రశాంతమైన ప్రాంతాలను ఇష్టపడ తారు, ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు వంటి విషయాలు తెలుసుకోవచ్చు. 


 ఇప్పటి వరకూ మీరు అందుకున్న పెద్ద బహుమతి ఏది? మామూలుగా మీ ఇద్దరి స్నేహితుల గురించి చెప్పుకొంటూ ఉంటారు. అదేసమయంలో వారికి ఇప్పటికి వచ్చిన పెద్ద బహుమతి ఏది, ఎవరు ఇచ్చారు? అని అడగండి. ఆ బహుమతి ఇచ్చిన వారి గురించి కొంత చెప్పమనండి. దీంతో వారికి బాగా దగ్గరి వాళ్ల గురించి కొంత తెలుసుకోవచ్చు.


 మీకు నచ్చని విషయాలేవి? సంభాషణ కొంత దూరం వెళ్లాక వ్యక్తిగతానికి సంబంధించిన ప్రశ్నలు అడగండి. అయితే మీరు ముందుగా మీకు నచ్చని విషయాలు వారికి చెప్పండి. ఆ తరువాత వారికి నచ్చనివి ఏంటో చెప్పమనండి. ఒకసారి మీ గురించి తెలుసుకున్న తరువాత వాళ్లు మొహమాట పడకుండా తమకు ఏవి నచ్చవో చెప్పేస్తారు.


 వీకెండ్స్‌లో ఏం చేస్తుంటారు? వారాంతాల్లో ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారో అడిగితే వారి ప్రాధాన్యాలు, అభిరుచులు తెలుస్తాయి. అంతేకాదు వారితో మీ మనసులోని మాట ఎప్పుడు చెప్పాలో, ఎప్పుడు చెప్పకూడదో అర్థమవుతుంది.


 రాబోయే రోజుల్లో రిలేషన్‌షి్‌పలో ఉండాలని అనుకుంటున్నారా? ఈ ప్రశ్నకు వెంటనే సమాధానం ఊహించడం కష్టమే. అయితే మీ ఇద్దరూ ప్రేమ, పెళ్లి, రిలేషన్‌షిప్‌ గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఈ ప్రశ్న అడగాలి. అయితే మీరు ఈ వివరాలన్నీ వారిని ప్రేమలో పడేసేందుకు ఆరా తీస్తున్నారని  అనిపించకూడదు. అందుకు వారు మీరు ఊహించినట్టు అవును అని లేదా ఇప్పట్లో అనుకోవడం లేదు అని చెప్పవచ్చు. 


 నా మీద మీ ఒపీనియన్‌? మీరు వారిపై క్రష్‌తో ఉన్నారనేది మీ మీద వారికి కలిగే మొదటి అభిప్రాయం అయి ఉండవచ్చు. అయినా సరే మీరు ఈ ప్రశ్న అడగడం ద్వారా వారు మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు, మీతో మాట్లాడినప్పుడు మీ గురించి ఏం అనుకున్నారు. ఇప్పుడు ఆ అభిప్రాయంలో ఏమైనా మార్పు ఉందా అనేది తెలుసుకోవచ్చు.


Updated Date - 2020-09-23T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising