అభిమాన గణం
ABN, First Publish Date - 2020-07-22T05:30:00+05:30
శ్రద్ధా కపూర్... అలనాటి ప్రతినాయకుడు శక్తికపూర్ తనయగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. కానీ... ఆ తరువాత తన అందం... తెరపై చలాకీతనంతో యువ హృదయాలను కొల్లగొట్టింది...
శ్రద్ధా కపూర్... అలనాటి ప్రతినాయకుడు శక్తికపూర్ తనయగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. కానీ... ఆ తరువాత తన అందం... తెరపై చలాకీతనంతో యువ హృదయాలను కొల్లగొట్టింది. దశాబ్ధం కిందట ‘తీన్ పత్తీ’తో ప్రారంభమైన ఆమె సినీ ప్రయాణం రెండు పదులకు పైగా చిత్రాలతో సాగిపోతోంది. గత ఏడాది టాలీవుడ్ హీరో ప్రభా్‌సతో చేసిన పాన్ ఇండియా సినిమా ‘సాహో’ శ్రద్ధాను తెలుగువారికీ దగ్గర చేసింది. ఆమె రేంజ్‌నీ పెంచింది. హిట్... ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఎప్పుడూ చేతి నిండా ప్రాజెక్ట్‌లతో కెరీర్‌లో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ డ్యాన్స్‌లు దుమ్ము రేపుతుంది.
స్టయిల్ స్టేట్‌మెంట్స్‌లో తనకు ఎవరూ సాటి లేరని నిరూపిస్తుంటుంది. ఎక్కడ ఉన్నా... ఏం చేస్తున్నా... థియేటర్‌లో తన సినిమాలు నడుస్తున్నా... నడవకపోయినా... సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులను నిత్యం అలరిస్తూనే ఉంటుంది. అందుకే బాలీవుడ్‌లో టాప్ స్టార్లకు కూడా లేనంత ఫాలోయింగ్ సంపాదించుకోగలిగింది శ్రద్ధ. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడామె అభిమానుల సంఖ్య ఎంతో తెలుసా..? 50.9 మిలియన్లు! హాలీవుడ్‌లోనూ పేరు తెచ్చుకున్న ప్రియాంకా చోప్రా (55 మిలియన్లు)తోనే పోటీ పడుతోంది. స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే (50.7 మిలియన్లు)ను దాటేసి తన ‘సోషల్ స్టామినా’ ఏమిటో నిరూపించుకుంది శ్రద్ధ.
Updated Date - 2020-07-22T05:30:00+05:30 IST