ఫార్మా-డితో భవిష్యత్తు ఉందా?
ABN, First Publish Date - 2020-02-13T06:08:21+05:30
ఫార్మా డి అనేది ఆరు సంవత్సరాల కోర్సు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభం అయింది. సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్ పూర్తిచేసిన వారు దీనికి అర్హులు. ఈ పట్టా
నేను ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాను. ఫార్మాడి కోర్సు గురించిన వివరాలు కావాలి. దీనికి అవకాశాలు ఎలా ఉంటాయో తెలుపగలరు?
- వసంత, వికారాబాద్
ఫార్మా డి అనేది ఆరు సంవత్సరాల కోర్సు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభం అయింది. సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్ పూర్తిచేసిన వారు దీనికి అర్హులు. ఈ పట్టా పొందినవారి సంఖ్య ఇంకా ఎక్కువగా లేదు. అందువల్ల దీని భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. మీరు చదవాలనుకుంటున్న కాలేజీకి అనుబంధంగా ఏదైనా ఆస్పత్రి ఉన్నట్లయితే పేషంట్లతో కలిసి పనిచేయడానికి అవకాశం, ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్ లభిస్తాయి. దీనితోపాటు మీరు బిఫార్మసీకి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇంటర్ పూర్తయ్యే లోపు మీ కుటుంబంలోనో, పరిచయస్తులతోనో ఫార్మసీ రంగంలో ఉన్నవారితో మాట్లాడండి. కోర్సు ఏదైనప్పటికీ అది పూర్తయ్యేనాటికి ఆ రంగం భవిష్యత్తు ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. దానినిబట్టి ఎందులో చేరాలో ఒక నిర్ణయానికి రావచ్చు.
Updated Date - 2020-02-13T06:08:21+05:30 IST