ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్తగా మొదలెడదాం...

ABN, First Publish Date - 2020-12-30T06:15:33+05:30

కొత్త సంవత్సరాన్ని ఒక మధుర జ్ఞాపకంగా, అవకాశాల వరంగా మలచుకోవాలనుకుంటాం. అందులో భాగంగానే వృత్తిగత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్త సంవత్సరాన్ని ఒక మధుర జ్ఞాపకంగా, అవకాశాల వరంగా మలచుకోవాలనుకుంటాం. అందులో భాగంగానే వృత్తిగత, వ్యక్తిగత జీవితాన్ని గొప్పగా తీర్చుదిద్దుకునేందుకు తోడ్పడే కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. మంచి కంపెనీలో ఉద్యోగం సాధించడం, బరువు తగ్గడం, కొత్త నైపుణ్యాలు అలవర్చుకోవడం వంటివి చాలామంది కొత్త ఏడాదిలో పెట్టుకునే లక్ష్యాలు. వీటితో పాటు న్యూ ఇయర్‌ రోజున తీసుకోదగ్గ నిర్ణయాలలో కొన్ని...


 ఆరోగ్యంతో పాటు చక్కని దేహధారుఢ్యం కలిగి ఉండడం చాలా ముఖ్యం. అందుకోసం రోజూ ఒక గంట వ్యాయామం. ఫిట్‌నెస్‌ లక్ష్యాలను పూర్తి చేయడం, ధ్యానం, యోగా సాధన, కొత్త రకం వ్యాయామాలు ప్రయత్నించడం వంటి  లక్ష్యాలను పెట్టుకోవాలి. ఇవి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుపరిచేందుకు ఎంతగానో పనికొస్తాయి.


 ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటేనే పురోగతి సాధిస్తాం. డిగ్రీ పట్టా పొందడం, వంట నేర్చుకోవడం, పర్యావరణహిత జీవనశైలిని కొనసాగించడం, మంచి అలవాట్లు అలవర్చుకోవడం, కొత్త భాష నేర్చుకోవడం... ఇవన్నీ    మానసిక సంతృప్తిని ఇవ్వడంతో పాటు వ్యక్తిత్వాన్ని బలపరుస్తాయి. 


 కుటుంబంతో సమయం గడపడం, కాసేపు పుస్తకం చదవడం, రోజూ ఉదయాన్నే వార్తాపత్రిక తిరగేయడం, ఏదో ఒక జర్నల్‌ ఫాలో అవడం, తోట పని చేయడం వంటి  పనులకు కొంత సమయం కేటాయించాలి. దాంతో ఒత్తిడి తగ్గి ప్రశాంతత ఆవరిస్తుంది. 


 రోజూ వెయ్యి మెట్లు ఎక్కడం, ఉదయాన్నే నిద్రలేవడం, రోజుకు రెండుసార్లు పళ్లు తోముకోవడం, మీ హాబీకి సమయం ఇవ్వడం, మీ వస్తువులను శుభ్రంగా ఉంచుకోవడం, ఎక్కువ నీళ్లు తాగడం, ఆరోగ్యకరమైన ఆహారం తినడం, టీవీ, గ్యాడ్జెట్లు చూసే సమయం తగ్గించడం... ఇవన్నీ చిన్న విషయాలే కానీ వీటిని ఆచరణలో పెడితే జీవితం ఎంతో హాయిగా, సంతోషంగా సాగుతుంది. 




 ప్రమోషన్‌ సాధించడం, కలల ఉద్యోగం సాధించడం, యోగా, డ్యాన్స్‌, సంగీతం సర్టిఫికెట్‌ పొందడం, ఈత నేర్చుకోవడ... ఈ లక్ష్యాలు మిమ్మల్ని నలుగురిలో ప్రత్యేకంగా నిలుపుతాయి.


 సగం జీతం పొదుపుచేయడం, ఆరోగ్య బీమా తీసుకోవడం వంటివి ఆర్థిక భరోసాను ఇచ్చే లక్ష్యాలు. కరోనా లాంటి విపత్తుల సమయంలో బీమా సౌకర్యం ఉంటే ఏ చింతా లేకుండా ఉండొచ్చు. 


Updated Date - 2020-12-30T06:15:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising