ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గెడ్డంతో గెలిచేస్తాడు

ABN, First Publish Date - 2020-10-28T05:49:52+05:30

మహమ్మద్‌ ఇక్రమ్‌... రెండు చేతులూ లేకుండానే పుట్టాడు. ఉండేది పాకిస్తాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రం... మారుమూల సముంద్రీ గ్రామం. నిరుపేద కుటుంబం. కానీ ఇప్పుడతడు రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయాడు. కారణం... అతడు గెడ్డంతో స్నూకర్‌ గెలిచేస్తాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహమ్మద్‌ ఇక్రమ్‌... రెండు చేతులూ లేకుండానే పుట్టాడు. ఉండేది పాకిస్తాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రం... మారుమూల సముంద్రీ గ్రామం. నిరుపేద కుటుంబం. కానీ ఇప్పుడతడు రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయాడు. కారణం... అతడు గెడ్డంతో స్నూకర్‌ గెలిచేస్తాడు. అవును... ఇది నమ్మలేని నిజం. చుట్టుపక్కల ఇక్రమ్‌ను కొట్టినవాడు లేడు. చేతులు లేవు. అయితేనేం... మెడ వంచి... క్యూ బాల్‌ను గెడ్డం ముందు పెట్టి... టేబుల్‌పై ఎక్కడి నుంచి ఎక్కడికైనా పాకెట్‌లోకి పంపిస్తాడు. 


‘‘చాలామంది స్నూకర్‌ ఆటగాళ్లను కలిశాను. నాలో అద్భుతమైన ప్రతిభ ఉందని వాళ్లంతా చెబుతుంటారు. దేశానికే గర్వకారణమని అభినందిస్తుంటారు’’ అంటున్న ఇక్రమ్‌... తొమ్మిది మంది సంతానంలో ఒకడు. కుటుంబ నేపథ్యం... శారీరక వైకల్యం... చిన్న వయసులోనే బడికి దూరమయ్యాడు. స్థానికంగా కొంతమంది స్నూకర్‌ ఆడడం చూసి... ఆటపై మోజు పెంచుకున్నాడు. తనూ ఆడాలనుకున్నాడు. కానీ ఎలా? స్నూకర్‌ క్లబ్‌లో ఎవరూ లేనప్పుడు రహస్యంగా సాధన మొదలుపెట్టాడు. ఆలోచన ఎప్పుడు వచ్చిందో... ఎలా వచ్చిందో తెలియదు... మొత్తానికి గెడ్డంతో క్యూ బాల్‌ను కొట్టడం అలవాటయింది ఇక్రమ్‌కు. క్లబ్‌కు వెళ్లినప్పుడు ‘ఆట ఇతడివల్ల ఏమవుతుంది’ అన్నవారు ఎందరో! అయితే మానవతా దృక్పథంతో సాధనకు అనుమతి ఇచ్చాడు క్లబ్‌ యజమాని.


సీన్‌ కట్‌ చేస్తే... గత రెండేళ్లుగా స్థానిక టోర్నమెంట్లలో ఇక్రమ్‌ గెలవని ట్రోఫీ లేదు. అతడి ప్రతిభకు పాక్‌లో ఎంతోమంది ఫిదా అయ్యారు. కొన్ని హోటళ్ల యజమానులు వచ్చినప్పుడల్లా ఉచితంగా వడ్డిస్తున్నారు. వెయిటర్స్‌ చెంచాతో నోటికి అందిస్తున్నారు. ‘ఇవన్నీ చూసినప్పుడు నా కళ్లు చమ్మగిల్లుతాయి. వారు చూపుతున్న ప్రేమ ఎనలేని ప్రోత్సాహాన్నిస్తుంది. ప్రభుత్వం సహకరిస్తే... ఏదో ఒక రోజు అంతర్జాతీయ పోటీల్లో కూడా పోటీపడతాను’’ అని భావోద్వేగంగా చెబుతాడు ఇక్రమ్‌. అతడి స్నూకర్‌ ట్యాలెంట్‌ సామాజిక మాధ్యమాల్లోకీ ఎక్కింది. ఇక చెప్పేదేముంది... ఇక్రమ్‌ పేరు ప్రపంచమంతా పరిచయమైంది. 

Updated Date - 2020-10-28T05:49:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising