ఉద్యమం.. ఆన్‌లైన్‌లో
ABN, First Publish Date - 2020-12-30T06:13:27+05:30
ఏదైనా ఒక విషయంపై తమ అభిప్రాయాన్ని పంచుకునేందుకు ఇప్పుడు సోషల్ మీడియాను మించిన వేదిక
ఏదైనా ఒక విషయంపై తమ అభిప్రాయాన్ని పంచుకునేందుకు ఇప్పుడు సోషల్ మీడియాను మించిన వేదిక లేదు. వివిధ అంశాలపై తమ నిరసనను పోస్ట్‌లు, కామెంట్ల రూపంలోనే కాకుండా హ్యాష్‌టాగ్ ద్వారా తెలియజేస్తున్నారు. ఈ ఏడాది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన కొన్ని హ్యాష్‌ట్యాగ్స్ ఇవి....
అన్‌ఫెయిర్‌అండ్‌లవ్లీ: అందంగా ఉండడం అంటే తెల్లగా ఉండడం అనే సందేశాన్ని చాటుతున్న ఫెయిర్ అండ్ లవ్లీ ఫెయిర్‌నెస్ క్రీమ్‌కు వ్యతిరేకంగా మొదలైన హ్యాష్‌ట్యాగ్ ‘అన్‌ఫెయిర్‌అండ్‌లవ్లీ’. సెలబ్రిటీలు, సినీతారల నుంచి కాలేజీ అమ్మాయిల వరకు అందరూ ఫెయిర్ అండ్ లవ్లీ ప్రకటనను విమర్శించారు. అలా మొదలైన ‘అన్‌ఫేయిర్‌అండ్‌లవీ’్ల హ్యాష్‌ట్యాగ్ ఈ ఏడాది ఆన్‌లైన్‌లో తెగ పాపులర్ అయింది. ఫెయిర్ అండ్ లవ్లీ పేరు గ్లో అండ్ లవ్లీగా మారడానికి ఈ హ్యాష్‌టాగే కారణం.
సేఫ్‌హ్యాండ్స్: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సోషల్ మీడియాలో ‘సేఫ్‌హ్యాండ్స్’ హ్యాష్‌ట్యాగ్‌ను మొదలెట్టింది. సెలబ్రిటీలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు చేతులు శుభ్రం చేసుకుంటున్న 20 సెకన్ల వీడియోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ హ్యాష్‌ట్యాగ్‌ను జనాల్లోకి తీసుకెళ్లారు.
ఛాలెంజ్ యాక్సెప్టెడ్: ఈ ఛాలెంజ్‌లో భాగంగా సెలబ్రిటీలు, హాలీవుడ్ నుంచి టాలీవుడ్ స్టార్లు తమ సోషల్‌మీడియా ఖాతాలో తమ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను పోస్ట్ చేశారు. అంతేకాదు తమ స్నేహితులు, బంధువులను నామినేట్ చేసి ‘ఛాలెంజ్ యాక్సెప్టెడ్’ హ్యాష్‌ట్యాగ్‌ను పాపులర్ చేశారు.
Updated Date - 2020-12-30T06:13:27+05:30 IST