డేటింగ్ కొత్తగా..
ABN, First Publish Date - 2020-12-02T05:59:37+05:30
ఒకప్పుడు డేటింగ్ అంటే ప్రేమ జంటలు చెట్టాపట్టాలేసుకొని ఊసులాడుకునేవారు. కానీ కరోనా భయాల నేపథ్యంలో ఆన్‌లైన్ ప్రేమలకే పరిమితం అవుతున్నారంతా. అయితే ప్రతి ఇద్దరిలో ఒకరు మనసైన వారిని నేరుగా కలిసేందుకు, డేటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆన్‌లైన్ డేటింగ్ యాప్...
ఒకప్పుడు డేటింగ్ అంటే ప్రేమ జంటలు చెట్టాపట్టాలేసుకొని ఊసులాడుకునేవారు. కానీ కరోనా భయాల నేపథ్యంలో ఆన్‌లైన్ ప్రేమలకే పరిమితం అవుతున్నారంతా. అయితే ప్రతి ఇద్దరిలో ఒకరు మనసైన వారిని నేరుగా కలిసేందుకు, డేటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆన్‌లైన్ డేటింగ్ యాప్ యాప్ బంబ్లే తాజా అధ్యయనం చెబుతోంది. ముఖాముఖి పరిచయం, డేటింగ్‌కు ఆసక్తి చూపేవారు గుర్తుంచుకోవాల్సినవి ఏమిటంటే...
వర్చ్యువల్ డేటింగ్: రెస్టారెంట్ లేదా కాఫీ డేలో కలిసి నచ్చినంత సేపు కబుర్లు చెప్పుకోవడం సాధ్యం కాని ఈ పరిస్థితుల్లో వర్చ్యువల్ డేటింగ్ మంచి ఆప్షన్. డేటింగ్ యాప్స్‌లో ఒకరి గురించి ఒకరు తెలుసుకోవచ్చు. బబ్లే వంటి డేటింగ్ యాప్ యాప్ ద్వారా వీడియో కాల్, వాయిస్ చాట్ చేసి, మనసుకు దగ్గర కావొచ్చు. ఎప్పుడు నేరుగా కలవాలో నిర్ణయించుకోవచ్చు.
లైఫ్‌స్టయిల్: జతగా అడుగులేయాలనుకునే ముందు ఒకరి లైఫ్‌స్టయిల్ మరొకరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కరోనా కాలంలో ‘మీకు సోషల్ మీడియా బబుల్ ఉందా?, మీరు ఆఫీసుకు వెళతారా?, మీరు జనం ఎక్కువగా వచ్చే పెళ్లిళ్లు, వేడుకలకు వెళతారా?, నేరుగా కలవడం మీకు ఇష్టమేనా? వంటి ప్రశ్నలు మీరు వారితో కొనసాగడం మీద స్పష్టతనిస్తాయి. డేటింగ్ యాప్‌లో కొత్తవారితో పరిచయం కావాలంటే బంబ్లే ఈ మధ్యే ప్రారంభించిన బ్యాడ్జెస్‌లోకి వెళితే చాలు
డేట్, టైమ్: మీరు అవతలి వారిపై మనసు పడి వారి గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే ఒక డేట్, టైమ్ ఫిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే డేటింగ్ యాప్స్ సాయంతో వారిని నేరుగా కలవక ముందే వారి మాన సిక స్థితి తెలుసుకునే వీలుంది. కానీ ఆన్‌లైన్‌లో చూసి మనసు పారేసుకోడం, కలిసి జీవించడం సాధ్యమవుతుందా! అని అనిపిస్తుంది. అందుకే మీ క్రష్‌తో మీరు ఎన్ని రోజులు అన్‌లైన్ డేటింగ్ చేయాలనుకుంటున్నారో చెప్పాలి. అయితే అది వారికి ఇష్టమో కాదో అడగడం మరచిపోవద్దు.
ఈ జాగ్రత్తలు: నేరుగా కలవాలని అనుకున్నప్పుడు కరోనా జాగ్రత్తలు అన్నీ తీసుకోవాలి. ముఖాముఖిగా కలవబోయే ముందు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో ఇద్దరూ ముందే ఒక అంగీకారానికి రావడం ముఖ్యం. చేయాల్సినవి, చేయకూడనివి గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే ఇద్దరికీ సౌకర్యంగా ఉంటుంది. ‘మీరు ఎంతమందిని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడారు?, వారు కరోనా పరీక్ష చేయించుకున్నారా?, ఎక్కడ కలవడం ఇద్దరికీ అనుకూలంగా ఉంటుంది? వంటి ప్రశ్నలు అడిగితే చాలా విషయాలు తెలుస్తాయి. అలానే రెండు వారాలు స్వీయనిర్భందంలో ఉన్న తరువాత డేట్ కు వెళ్లడం ఇద్దరికీ మంచిది.
దూరం పాటించాలి: కరోనా సమయంలో డేటింగ్ అంటే సురక్షితమేనా అనే భయం చాలామందిలో ఉంటుంది. అందుచేత మీరు మనసుపడిన వారిని నేరుగా కలిసేటప్పుడు మాస్క్ ధరించేందుకు సందేహించవద్దు. దూరంగా కూర్చొని మాట్లాడాలి. నో షేక్‌హ్యాండ్. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఇద్దరూ డేట్‌ను ఎంజాయ్ చేయవచ్చు.
Updated Date - 2020-12-02T05:59:37+05:30 IST