ఆన్‌లైన్‌లో ఆట
ABN, First Publish Date - 2020-09-09T05:30:00+05:30
ఆ రోజులే వేరు. స్నేహితులు... సరదాలు... క్లబ్‌లు... పబ్‌లు. మరి ఇప్పుడు? కరోనా దెబ్బకు ఎక్కడి వారు అక్కడే! కుర్రకారు జోష్ మాయమై ఎవరి ఇళ్లలో వారే లాకైపోతున్నారు.
ఆ రోజులే వేరు. స్నేహితులు... సరదాలు... క్లబ్‌లు... పబ్‌లు. మరి ఇప్పుడు? కరోనా దెబ్బకు ఎక్కడి వారు అక్కడే! కుర్రకారు జోష్ మాయమై ఎవరి ఇళ్లలో వారే లాకైపోతున్నారు. అయితే ఈ ‘బోర్‌డమ్’ నుంచి కాస్తంత ఉపశమనం కలిగిస్తోంది ‘స్టే హోమ్ డ్యాన్స్ కాంపిటీషన్’. బయట కాలు పెట్టకుండా యువత తమ డ్యాన్స్ ట్యాలెంట్‌ను ప్రదర్శించే అవకాశమున్న వేదిక ఇది. ఔత్సాహికులు, ప్రొఫెషనల్స్... ఎవరైనా సరే తమ సత్తా చాటుకోవచ్చు. దక్షిణ అమెరికాకు చెందిన ఫాకుండో లుక్వీ, మాన్యుయల్లా లావెల్లేలది ఈ పోటీల ఆలోచన. ఇద్దరూ మంచి డ్యాన్సర్లు. ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహిస్తున్న ఈ పోటీ... అర్జెంటీనాలో మొదలై బ్రెజిల్, ఇజ్రాయల్, ఇటలీ, ఈజిప్ట్, అమెరికా... ఇలా ప్రపంచ దేశాలన్నింటికీ పాకింది. క్వారంటైన్ సమయంలో ఇంట్లో చేసిన డ్యాన్స్‌లేవైనా సరే పోస్ట్ చేయవచ్చు. అలా వచ్చిన వాటి నుంచి గతవారం విజేతలను ప్రకటించారు. వారిని ఎంపిక చేసింది ఎవరో తెలుసా? ప్రొఫెషనల్ డ్యాన్సర్స్‌తో కూడా న్యాయనిర్ణేతల బృందం. విశేషమేమంటే ఇందులో యువతరమే కాదు... నడివయస్కులు కూడా ఉత్సాహంగా పోటీపడటం. తమ ట్యాలెంట్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వస్తుండడంతో ఔత్సాహిక డ్యాన్సర్ల ఆనందానికి హద్దులు ఉండడంలేదు.
Updated Date - 2020-09-09T05:30:00+05:30 IST