ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌

ABN, First Publish Date - 2020-11-25T06:27:34+05:30

లఘుచిత్రాలతో హోరెత్తిస్తున్న యువతరం ఇప్పుడు రెండున్న గంటల పూర్తి స్థాయి చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తోంది. రంగుల ప్రపంచంపైనున్న మక్కువతో... తమకు అవకాశాలు రాలేదని బాధపడుతూ కూర్చోకుండా... అవకాశాలే తమను వెతుక్కుంటూ వచ్చేలా చేసుకొంటోంది. దానికి దగ్గరి మార్గమే లఘుచిత్రాలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఘుచిత్రాలతో హోరెత్తిస్తున్న యువతరం ఇప్పుడు రెండున్న గంటల పూర్తి స్థాయి చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తోంది. రంగుల ప్రపంచంపైనున్న మక్కువతో... తమకు అవకాశాలు రాలేదని బాధపడుతూ కూర్చోకుండా... అవకాశాలే తమను వెతుక్కుంటూ వచ్చేలా చేసుకొంటోంది. దానికి దగ్గరి మార్గమే లఘుచిత్రాలు. యూట్యూబ్‌ వేదికగా తమ సత్తా ఏమిటో చూపిస్తోంది. దీని ద్వారా సినిమా అవకాశాలు పొందిన దర్శకులు, నటులు చాలామందే ఉన్నారంటే షార్ట్‌ ఫిలిమ్స్‌కు ఎంత ఆదరణ ఉందో వేరే చెప్పక్కర్లేదు. విషయానికి వస్తే... అదే యూట్యూబ్‌లో ఇప్పుడు మూడు గంటల నిడివిగల ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’అనే చిత్రం ఒకటి విడుదలైంది.


ఊరూ పేరూ లేని నటులు, సాంకేతిక సిబ్బంది రూపొందించిన ఈ సినిమాను అంత సమయం వెచ్చించి ఎవరు చూస్తారులే అనుకోవద్దు. అప్‌లోడ్‌ చేసిన నాలుగు రోజుల్లోనే దాదాపు 45 లక్షల మంది వీక్షించేశారు. స్టార్‌ హీరో సినిమా కోసం వేచి చూసే ఫ్యాన్స్‌లా గంట గంటకూ వ్యూయర్‌షిప్‌ కౌంట్‌ పెరిగిపోతోంది. సుబ్బు కె దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షణ్ముఖ్‌ జస్వంత్‌, వైష్ణవి చైతన్య, శ్రీవిద్య, శ్రీప్రియ తదితరులు నటించారు. ఇన్ఫినిటమ్‌ మీడియా నిర్మించింది. షణు అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అమెరికా కల, ఆ తరువాత ఉద్యోగంలో వైష్ణవితో అతడి ప్రేమాయణం, ప్రేయసితో మనస్పర్థలు, మధ్యలో విరహం, విడిపోవడం... ఇలా సాగుతుంది కథ. సాఫ్ట్‌వేర్‌ కొలువులు, అక్కడ పండే ప్రేమలు, కలిసే మిత్రులు, వారితో విందులు, వినోదాలు... చిత్రం సాగదీసినట్టు అనిపించినా, యువతను ఆకర్షించే కామన్‌ అంశాలు ఉన్నాయి కాబట్టి చివరి దాకా చూసేట్టు చేస్తుంది. వంశీ శ్రీనివాస్‌ సినిమాటోగ్రఫీ, సుమన్‌ వంకర నేపథ్య సంగీతం చిత్రాన్ని ఆహ్లాదంగా మార్చాయి. ప్రధాన పాత్రల్లో షణ్ముఖ్‌, వైష్ణవిల నటన కొత్తవాళ్లు చేస్తున్న ఫీలింగ్‌ రానివ్వదు. వీరు గతంలో కొన్ని లఘుచిత్రాల్లో కనిపించినవారే.

Updated Date - 2020-11-25T06:27:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising