రాహుల్ స్టయిలే వేరు
ABN, First Publish Date - 2020-05-20T05:30:00+05:30
క్రేజీ లుక్స్‌తో ‘పోస్టర్ బాయ్’ ఇమేజ్ తెచ్చుకున్న ఈ కర్ణాటక ఆటగాడు టీమ్ ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా! ఆటకు ఫిదా అయ్యేవారే కాదు... అతడి స్టయిల్‌కు పడిపోయే అమ్మాయిలకూ లెక్క లేదు...
భారత క్రికెట్ జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ మైదానంలోనే కాదు... మైదానం వెలుపలా స్టార్ ఎట్రాక్షనే!
క్రేజీ లుక్స్‌తో ‘పోస్టర్ బాయ్’ ఇమేజ్ తెచ్చుకున్న ఈ కర్ణాటక ఆటగాడు టీమ్ ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా! ఆటకు ఫిదా అయ్యేవారే కాదు... అతడి స్టయిల్‌కు పడిపోయే అమ్మాయిలకూ లెక్క లేదు. ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు రాహుల్. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టితో డేటింగ్‌లో ఉన్నాడని వినికిడి. ఆ విషయం పక్కన పెడితే... ఈ లాక్‌డౌన్ వేళ సామాజిక మాధ్యమాల్లో బిజీగా ఉన్నాడు ఈ ఓపెనర్. ఎప్పటికప్పుడు విభిన్నమైన ఫొటోలు పెడుతూ అభిమానులను ఆకట్టుకొంటున్నాడు. అలాంటిదే ఇక్కడ ఉన్న ఫొటో. ఇందులో రాహుల్ వేసుకున్న ‘స్వెట్ షర్ట్’పై విపరీతంగా చర్చ జరుగుతోంది. నలుపు, బూడిద రంగు కాంబినేషన్‌లో ఉన్న ఆ షర్ట్ చూడ్డానికి పెద్దగా హడావుడిగా కనిపించకపోయినా... దాని వెనకాల రేటు చూస్తే మాత్రం దిమ్మ తిరుగుతుంది. అంతగా ఏముంది ఇందులో అంటారా! ప్రముఖ జార్జియా ఫ్యాషన్ డిజైనర్ డెమ్నా గ్వాసాలియాకు చెందిన బ్యాలెన్సియాగా సంస్థ దీన్ని డిజైన్ చేసింది.
స్పోర్ట్స్ లగ్జరీ లుక్ దీని ప్రత్యేకత. రౌండ్ నెక్, పొడవాటి చేతులు, మడతపెట్టి కుట్టిన ముంజేతి పట్టీ, ఛాతీపైన సిన్నర్స్ బ్రాండ్‌ను ఎంబ్రాయిడరీ చేసిన తీరు ఈ ఓవర్‌సైజ్‌డ్ స్వెట్ షర్ట్ ప్రత్యేకతలు. ఇంతకీ ధర చెప్పలేదు కదూ... అక్షరాలా నలభై వేల రూపాయలు!
Updated Date - 2020-05-20T05:30:00+05:30 IST