ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వధువు... వరుడు ఒక్కరే!

ABN, First Publish Date - 2020-11-11T06:11:27+05:30

గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకొందామనుకున్నారు. నిశ్చితార్థం జరుపుకున్నారు. పెళ్లి తేదీ కూడా ఫిక్స్‌ చేసుకున్నారు. చివరకు ఆ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకొందామనుకున్నారు. నిశ్చితార్థం జరుపుకున్నారు. పెళ్లి తేదీ కూడా ఫిక్స్‌ చేసుకున్నారు. చివరకు ఆ శుభ ఘడియలు సమీపిస్తున్న తరుణంలో ప్రియురాలు షాకిచ్చింది. ‘నీతో జీవితాన్ని పంచుకోలేనం’టూ అతడి ప్రేమను కాదని వెళ్లిపోయింది. ఊహించని ఈ పరిణామంతో సాధారణంగా ప్రియుడు బాధతో కుంగిపోతాడు.


ప్రేమ విఫలమయ్యాక... ప్రేయసిని మరిచిపోలేక... ‘ప్రేమ ఎంత మధురం... ప్రియురాలు అంత కఠినం’ అంటూ గదిలో ఓ పెగ్గేస్తూనో... ‘ప్రేమ లేనే లేదని... ప్రేమించరాదని’ అనుకొంటూ ఒంటరిగా ఏ తీరానో తనలో తాను రోదిస్తూ ఉంటాడు. సినిమా కథలైనా... నిజ జీవితంలోనైనా మనకు ఎదురయ్యే విఫల ప్రేమికుల వ్యథలు ఇవే. 

కానీ మనోడు... కాదని వెళ్లిపోయిన ప్రేయసికే కాదు... ఈ ప్రపంచానికే ఓ ట్విస్ట్‌ ఇచ్చాడు. మనోవేదనతో గెడ్డం పెంచుకుని చీకటితో చెలిమి చేయకుండా... తనను తానే పెళ్లి చేసుకున్నాడు. అదీ అలా ఇలా కాదు... అందరినీ పిలిచి... ఆనందంగా... ఓ మధుర ఘట్టంగా జరుపుకున్నాడు. అంటే పెళ్లికొడుకూ... పెళ్లికూతురూ ఒక్కరేనన్నమాట. షాకవ్వద్దు. నిజంగా ఇది నిజం. ఇంతకీ అతడెవరనేగా..! పేరు డిగో రాబెలో. దేశం బ్రెజిల్‌. 


అసలేం జరిగిందంటే... 

విటోర్‌ బ్యునో అనే అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు డిగో. ఆమె కూడా అతడి ప్రేమలో అంతే తరించింది. మనసులు కలిశాయి. ఇరువురి ప్రేమలు పండాయి. ఈ అనుభూతిని ఇలాగే జీవితాంతం పొందాలనుకున్నారు ఇద్దరూ! ఇక అడ్డేముంది..! గత ఏడాది నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. ఓ ఆరేడు నెలలు ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’. ఆ తరువాతే మొదలైంది ‘గో టూ హెల్‌’!


ఇద్దరి మధ్య చిన్న చిన్న విషయాలు చర్చకు వచ్చాయి. ఒకరు అదంటే.. ఇంకొకరు వేరొకటంటారు. ఎవరికి వారు తాము చెప్పిందే చెల్లాలనే పట్టు. మాటా మాటా పెరిగింది. మనస్పర్థలు వచ్చాయి. దూరం సాధారణమైపోయింది. ఇది భరించలేని డిగో... ‘సర్దుకుపోదాం రా’ అన్నాడు. బతిమలాడాడు. విటోర్‌ ససేమిరా అంది.


‘ఆరంభమే ఇలా ఉంటే ఇక ఇద్దరం ఒకటయ్యాక పరిస్థితి ఏంట’నే దూరాలోచనతో వదిలేసి వెళ్లిపోయింది. ఎంత చెప్పినా వినకపోయేసరికి ప్రేమపై విరక్తి చెందిన డిగో ప్రేయసిని మరిచిపోవాలనుకున్నాడు. దాంతోపాటే తనలాంటి వారికి గుణపాఠంగా నిలవాలనుకున్నాడో... బాధలో జీవితాన్ని పాడుచేసుకోవద్దని కుర్రాళ్లకు చెప్పాలనుకున్నాడో... మొత్తానికి ఇటీవల పదిమంది సమక్షంలో అద్దం ముందు నిల్చొని ‘ఐ డూ’ అంటూ తనను తానే పెళ్లి చేసుకున్నాడు. ఈ అరుదైన పెళ్లికి అతని సన్నిహితులు, స్నేహితులు, బంధువులు హాజరయ్యారు. వరుడిని... కాదు కాదు... వధువుని కూడా ఆశీర్వదించారు.


Updated Date - 2020-11-11T06:11:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising